☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

‘వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సంరక్షణ’

ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పురుగు–తెగుళ్లను గుర్తించిన వెంటనే తగిన నివారణ చర్యలు చేపట్టాలని భద్రాద్రి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త, అధిపతి డాక్టర్ టి.భరత్ సూచించారు. పంటల దశకు అనుగుణంగా...
‘వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సంరక్షణ’

– రైతులు అప్రమత్తంగా ఉండాలి
– కేవీకే సీనియ‌ర్ శాస్త్రవేత్త డాక్టర్ టి.భరత్ సూచ‌న‌

రుద్రంపూర్, సెప్టెంబర్ 23 : ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పురుగు–తెగుళ్లను గుర్తించిన వెంటనే తగిన నివారణ చర్యలు చేపట్టాలని భద్రాద్రి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త, అధిపతి డాక్టర్ టి.భరత్ సూచించారు. పంటల దశకు అనుగుణంగా నీటి యాజమాన్యం, పోషకాల వినియోగం, మందుల పిచికారి చేపట్టాలని తెలిపారు.

వరి : ప్రస్తుతం పంట పీలక దశలో ఉన్నందున పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. కాండం కుళ్లు తెగులు కనిపిస్తే ప్రొపికోనజోల్ 1 మి.లీ. లేదా హెక్సాకోనజోల్ 2 మి.లీ. లేదా వాలిడామైసిన్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. కాండం తొలుచు పురుగు ఉధృతి ఉంటే క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలని సూచించారు.

పత్తి : పూత, కాయలు ఏర్పడే దశలో ఉన్న పత్తిలో పురుగు ఉధృతిని గమనించాలి. మొక్కలకు పోషకాల లోపం ఉంటే 2 శాతం యూరియా లేదా 1 శాతం పొటాషియం నైట్రేట్‌ ద్రావణాన్ని పిచికారి చేయాలి. పత్తిలో పచ్చ దోమ మరియు గమనించినట్లయితే నివారణకు రెండు మిల్లీ లీటర్ల పెప్రోనిల్ లేదా ప్లానికా మిడ్ 0. 3గ్రామ్స్ మందును 5 మిల్లీలీటర్ల 1500 పిపిఎం వేప నూనె పాటు లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.గులాబీ రంగు పురుగు ఆశించినట్లయితే ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలను అమర్చాలి. గులాబీ రంగు పురుగు నివారణకు 2 మిల్లీ లీటర్ల ప్రొఫెనోఫోస్ మందును పిచికారి చేయాలి.

మొక్కజొన్న : పూత దశలో ఉన్న మొక్కజొన్నలో పోషకాల లోపం కనిపిస్తే 2 శాతం యూరియా లేదా 1 శాతం పొటాషియం నైట్రేట్‌ పిచికారి చేయాలి. కత్తెర పురుగు, ఇతర పురుగుల ఉధృతిని గమనిస్తూ సకాలంలో నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
కంది, మినుము: కంది పంటలో ఎదుగుదల మందగిస్తే 2 శాతం యూరియా లేదా 1 శాతం పొటాషియం నైట్రేట్‌ పిచికారి చేయాలి. మినుములో కాండం ఈగ ఉధృతి ఉంటే ఎకరాకు 1 గ్రాము ఎసిఫేట్‌ను లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలని తెలిపారు.

కూరగాయలు : మిరప, టమాటా, వంకాయ తదితర కూరగాయల్లో తెగుళ్లను గుర్తించి సకాలంలో నివారణ చర్యలు చేపట్టాలి. అవసరాన్ని బట్టి మాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా మెటలాక్సిల్ 2 గ్రాములు లేదా కార్బెండజిమ్+మాంకోజెబ్ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలని సూచించారు.

పశుపోషణ : పశువులకు పరిశుభ్రమైన తాగునీరు, పచ్చిమేత అందించడంతో పాటు సకాలంలో టీకాలు వేయించాలి. గొర్రెలు, మేకలకు పీపీఆర్‌ టీకా వేయించాలని, నట్టల నివారణకు డీవార్మింగ్‌ చేయించాలని డాక్టర్‌ భరత్‌ సూచించారు. మందులను అవసరానికి మించి వినియోగించకుండా, సిఫారసు చేసిన మోతాదులోనే పిచికారి చేయాలని, పంటకు సంబంధించిన సమస్యపై సందేహం ఉంటే వ్యవసాయ శాఖ అధికారులు లేదా కృషి విజ్ఞాన కేంద్రాన్ని సంప్రదించాలని ఆయన సూచించారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ఒరాకిల్ లేఆఫ్స్‌లో షాకింగ్ నిజాలు: ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఎక్కువగా 40 ఏళ్లు దాటినవారే!Weight Gain | ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో బ‌రువు పెర‌గాలంటే.. ఇలా చేయండి.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com