Deepika Padukone | బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ తమ అభిమానులకు దసరా పర్వదినం సందర్భంగా అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. తమ చిన్నారి రెండవ కూతురి ఫోటోను షేర్ చేయడంతో పాటు ఆ పాప పేరు ‘దేవి పదుకొనే సింగ్’ అని అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ దంపతులకు ‘దువా’ అనే మరో కూతురు ఉన్న విషయం తెలిసిందే.
ప్రొఫెషనల్ లైఫ్ విషయానికి వస్తే, దీపికా షారుఖ్ ఖాన్ ‘కింగ్’ సినిమాతో పాటు అల్లు అర్జున్ సరసన ‘రాకా’ చిత్రంలో నటిస్తుండగా, రణవీర్ సింగ్ ‘ధురంధర్’ విజయాల జోరుతో పాటు కొత్తగా ‘ప్రళయ్’ అనే భారీ యాక్షన్ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టారు. అటు పర్సనల్ లైఫ్, ఇటు కెరీర్‌పరంగా ఈ టాలెంటెడ్ కపుల్ ఫుల్ హ్యాపీ మూమెంట్స్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.






