☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

తిరుమలలో భక్తుల ఆందోళన.. సిఫార్సు లేఖలతో వచ్చిన వారికి దర్శనం కల్పించాలని డిమాండ్

తిరుమలలో భక్తుల ఆందోళన.. సిఫార్సు లేఖలతో వచ్చిన వారికి దర్శనం కల్పించాలని డిమాండ్
తిరుమలలో భక్తుల ఆందోళన.. సిఫార్సు లేఖలతో వచ్చిన వారికి దర్శనం కల్పించాలని డిమాండ్
తిరుమలలో భక్తుల ఆందోళన.. సిఫార్సు లేఖలతో వచ్చిన వారికి దర్శనం కల్పించాలని డిమాండ్

తిరుమల: శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన పలువురు భక్తులు ఆందోళనకు దిగారు. ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో వచ్చిన తమకు దర్శన అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ తిరుమల అడిషనల్ ఈవో కార్యాలయం ముందు బైఠాయించారు. గోవిందా.. గోవిందా అంటూ నామస్మరణ చేస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

తిరుమలలో భక్తుల రద్దీ నేపథ్యంలో వీఐపీ దర్శనాలకు సంబంధించి టీటీడీ తీసుకున్న నిర్ణయం కారణంగా సిఫార్సు లేఖలతో వచ్చిన భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధుల నుంచి ముందుగానే సిఫార్సు లేఖలు తీసుకుని, కుటుంబ సభ్యులతో కలిసి సుదూర ప్రాంతాల నుంచి తిరుమలకు చేరుకున్నామని చెప్పారు.

తిరుమల ప్రయాణం కోసం రైళ్లు, బస్సుల్లో ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్నామని భక్తులు తెలిపారు. ఎన్నో వ్యయప్రయాసలతో తిరుమలకు చేరుకున్న తర్వాత సిఫార్సు లేఖలను స్వీకరించడం లేదని అధికారులు చెప్పడంతో నిరాశకు గురయ్యామని వాపోయారు.

వీఐపీ దర్శనాలపై ఆంక్షలకు సంబంధించిన సమాచారం కొద్ది రోజుల ముందే వెలువడిందని, అయితే విషయం తెలియని చాలామంది భక్తులు అప్పటికే తమ ప్రయాణ ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చిన తర్వాత దర్శనం విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

సిఫార్సు లేఖలతో వచ్చిన పలువురు భక్తులు తిరుమలలోని అడిషనల్ ఈవో కార్యాలయం గేటు ముందు రోడ్డుపై బైఠాయించారు. గోవింద నామస్మరణ చేస్తూ నిరసన తెలిపారు. తాము ముందుగానే తీసుకొచ్చిన ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను పరిగణనలోకి తీసుకుని శ్రీవారి దర్శనానికి అవకాశం కల్పించాలని టీటీడీ అధికారులను కోరారు. తమ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని తగిన విధంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.


©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← వాయు ఏఐ’ చాట్‌‌బాట్ సపోర్ట్ తో..లావా షార్క్‌‌ 2 ప్రో 5జీ లాంచ్‌‌రూ.15 వేలకే 5G బడ్జెట్ ఫోన్.. 6,000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com