☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Food Safety : ఎక్స్‌పైరీ మసాలాలకు కొత్త తేదీలు.. దిల్ బహార్ యూనిట్‌పై ఎస్‌వోటీ దాడి

Food Safety : గడువు ముగిసిన మసాలా ఉత్పత్తులపై దొంగ తేదీలు ముద్రించి, మార్కెట్లో విక్రయించేందుకు సిద్ధం చేస్తున్న ఓ తయారీ యూనిట్‌పై ఉప్పల్ జోన్ ఎస్‌వోటీ (SOT) పోలీసులు మెరుపు దాడి చేశారు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అన్నోజిగూడలో ఉన్న ‘దిల్ బహార్’ తయారీ యూనిట్‌పై దాడులు నిర్వహించి, రూ.లక్ష విలువైన కాలం చెల్లిన సరుకును స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం […]
Food Safety : ఎక్స్‌పైరీ మసాలాలకు కొత్త తేదీలు.. దిల్ బహార్ యూనిట్‌పై ఎస్‌వోటీ దాడి

Food Safety : గడువు ముగిసిన మసాలా ఉత్పత్తులపై దొంగ తేదీలు ముద్రించి, మార్కెట్లో విక్రయించేందుకు సిద్ధం చేస్తున్న ఓ తయారీ యూనిట్‌పై ఉప్పల్ జోన్ ఎస్‌వోటీ (SOT) పోలీసులు మెరుపు దాడి చేశారు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అన్నోజిగూడలో ఉన్న ‘దిల్ బహార్’ తయారీ యూనిట్‌పై దాడులు నిర్వహించి, రూ.లక్ష విలువైన కాలం చెల్లిన సరుకును స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

తెల్లటి స్టిక్కర్లతో మోసం.. పక్కా సమాచారంతో దాడులు

ఈ తనిఖీల సందర్భంగా ఎలాంటి సక్రమమైన తేదీ వివరాలు లేకుండానే పలు రకాల మసాలా ఉత్పత్తులను తయారీ చేసి ప్యాకింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా, గడువు ముగిసిన ప్యాకెట్లపై ఉన్న అసలు ఎక్స్‌పైరీ తేదీలను తెల్లటి స్టిక్కర్లతో కప్పివేసి, వాటిపై నకిలీ కొత్త తేదీలను ముద్రిస్తున్నట్లు విచారణలో తేలింది. ఆపై ఆ ప్యాకెట్లను తిరిగి రీ-సీల్ చేసి, మార్కెట్లో గడువు ముగియని తాజా ఉత్పత్తులుగా చూపిస్తూ విక్రయించేందుకు, వివిధ ప్రాంతాలకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తుండగా పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు.

రూ.లక్ష సరుకు జప్తు.. యజమాని, మేనేజర్‌పై కేసు

ఈ దాడుల్లో దిల్ బహార్ బ్రాండ్‌కు చెందిన మటన్ బిర్యానీ మసాలా, డ్రై మ్యాంగో పౌడర్, సబ్జీ మసాలా, చికెన్ మసాలా, మీట్ మసాలా, టీ పౌడర్‌తో పాటు ఇతర మసాలా ఉత్పత్తులకు సంబంధించిన సుమారు రూ.లక్ష విలువైన సరుకును పోలీసులు జప్తు చేశారు. ఈ అక్రమ రవాణా, కల్తీ వ్యవహారంలో తయారీ యూనిట్ మేనేజర్ షేక్ జహంగీర్, యజమాని షేక్ మహ్మద్ నబీలను గుర్తించారు. నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న సరుకును పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు అప్పగించగా, వారిపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Adilabad RIMS Fire : రిమ్స్ విషాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.!Janasena Party: జనసేన తెలంగాణలో కొత్త కమిటీ.. జాయినింగ్ కమిటీ కన్వీనర్‌గా ప్రేమ్ కుమార్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com