☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Janasena Party: జనసేన తెలంగాణలో కొత్త కమిటీ.. జాయినింగ్ కమిటీ కన్వీనర్‌గా ప్రేమ్ కుమార్

Janasena Party: తెలంగాణలో జనసేన బలోపేతానికి కీలక నిర్ణయం తీసుకుంది.. జనసేన పార్టీ తెలంగాణ జాయినింగ్ కమిటీ కన్వీనర్‌గా ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్‌ను నియమించారు.. గతంలో ఉన్న జాయినింగ్ కమిటీలో అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తూ మొత్తం 10 మంది సభ్యులతో సవరించిన కమిటీని ఏర్పాటు చేసినట్లు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సవరించిన జాయినింగ్ కమిటీకి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి […]
Janasena Party: జనసేన తెలంగాణలో కొత్త కమిటీ.. జాయినింగ్ కమిటీ కన్వీనర్‌గా ప్రేమ్ కుమార్

Janasena Party: తెలంగాణలో జనసేన బలోపేతానికి కీలక నిర్ణయం తీసుకుంది.. జనసేన పార్టీ తెలంగాణ జాయినింగ్ కమిటీ కన్వీనర్‌గా ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్‌ను నియమించారు.. గతంలో ఉన్న జాయినింగ్ కమిటీలో అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తూ మొత్తం 10 మంది సభ్యులతో సవరించిన కమిటీని ఏర్పాటు చేసినట్లు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సవరించిన జాయినింగ్ కమిటీకి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న వారితో సమన్వయం చేయడంలో ఆయన గత కొంతకాలంగా జాయినింగ్ కమిటీలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు పార్టీ తెలిపింది.

ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గత ఎన్నికల్లో కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల్లో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చారని పార్టీ పేర్కొంది. ప్రస్తుతం తెలంగాణలో జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న వారితో సమన్వయం చేస్తూ పార్టీ విస్తరణకు సంబంధించిన కార్యక్రమాల్లో ఆయన కీలకంగా వ్యవహరించనున్నారు. తెలంగాణలో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతం చేయడం, జనసేనలో చేరేందుకు ఆసక్తి ఉన్నవారిని సమన్వయం చేయడం వంటి బాధ్యతలను జాయినింగ్ కమిటీ నిర్వహించనుంది. ఈ మేరకు 10 మంది సభ్యులతో సవరించిన కమిటీకి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ నాయకత్వం వహించనున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Food Safety : ఎక్స్‌పైరీ మసాలాలకు కొత్త తేదీలు.. దిల్ బహార్ యూనిట్‌పై ఎస్‌వోటీ దాడిUkraine War: ఉక్రెయిన్‌లో తుస్సుమన్న పాకిస్తానీ మందుగుండు.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com