☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Ukraine War: ఉక్రెయిన్‌లో తుస్సుమన్న పాకిస్తానీ మందుగుండు..

Ukraine War: ఉక్రెయిన్ యుద్ధంలో పాకిస్తానీ మందుగుండు సామాగ్రి తుస్సుమంటోంది. పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తయారీలకు చెందిన 155mm మందుగుండు సామగ్రిలో నాణ్యతా సమస్యలు ఉన్నాయని ఒక ఉక్రేనియన్ ఆర్టిలరీ బ్రిగేడ్ కమాండర్ ఫిర్యాదు చేశారు. కొన్ని బ్యాచుల్లో నాణ్యతా సమస్యలు బయటపడ్డినట్లు వెల్లడించారు. దీని వల్ల ఫిరంగి బృందాలు వేర్వేరు తయారీదారులకు సంబంధించిన వేర్వేరు బాలిస్టిక్ డేటా ఉపయోగించాల్సి వస్తోందని చెప్పారు. ఈ పరిస్థితులు యుద్ధభూమిలో ఖచ్చితత్వం, సామర్థ్యంపై ప్రభావం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌లో తయారైన […]
Ukraine War: ఉక్రెయిన్‌లో తుస్సుమన్న పాకిస్తానీ మందుగుండు..

Ukraine War: ఉక్రెయిన్ యుద్ధంలో పాకిస్తానీ మందుగుండు సామాగ్రి తుస్సుమంటోంది. పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తయారీలకు చెందిన 155mm మందుగుండు సామగ్రిలో నాణ్యతా సమస్యలు ఉన్నాయని ఒక ఉక్రేనియన్ ఆర్టిలరీ బ్రిగేడ్ కమాండర్ ఫిర్యాదు చేశారు. కొన్ని బ్యాచుల్లో నాణ్యతా సమస్యలు బయటపడ్డినట్లు వెల్లడించారు. దీని వల్ల ఫిరంగి బృందాలు వేర్వేరు తయారీదారులకు సంబంధించిన వేర్వేరు బాలిస్టిక్ డేటా ఉపయోగించాల్సి వస్తోందని చెప్పారు. ఈ పరిస్థితులు యుద్ధభూమిలో ఖచ్చితత్వం, సామర్థ్యంపై ప్రభావం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌లో తయారైన M107 155mm షెల్స్‌ను ఉక్రెయిన్ రష్యాకు వ్యతిరేకంగా వాడుతోంది.

వివిధ తయారీదారులకు వివిధ బాలిస్టిక్ పట్టికలు ఉపయోగించాల్సి వస్తోందని, దీని వల్ల ఫైరింగ్ ముందు సిద్ధం కావడానికి అదనపు సమయం పట్టడంతో పాటు పొరపాటు అవకాశాలు కూడా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంలో పాకిస్తాన్ నుంచి మందుగుండు సామాగ్రి ఎగుమతి అవుతోంది. పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ చాలా కాలంగా మందుగుండును పెద్ద ఎత్తున సరఫరా చేస్తోందని యూఎస్ ఒప్పందాలు సూచిస్తున్నాయి.

ఇదిలా ఉంటే, ఈ వ్యాఖ్యలకు 1965 నాటి యుద్ధాన్ని జత చేస్తున్నారు. ఆ యుద్ధంలో జైసల్మేర్‌లోని తానోట్ ప్రాంతంలో పాకిస్తానీలు ప్రయోగించిన కొన్ని షెల్స్ పేలలేదని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధంలో ఇలాంటి ఆరోపణలే వస్తున్నాయి. ఉక్రెయిన్ 7వ ఆర్టిలరీ బ్రిగేడ్ కమాండర్ విటాలి కొర్నియెంకో ఈ వ్యాఖ్యలు చేశారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Janasena Party: జనసేన తెలంగాణలో కొత్త కమిటీ.. జాయినింగ్ కమిటీ కన్వీనర్‌గా ప్రేమ్ కుమార్రెండు జడలతో ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు టాలీవుడ్‌లో సెన్సేషన్ డైరెక్టర్! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com