☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఈవెంట్‌లో ఎన్టీఆర్ ఎమోషనల్ కామెంట్స్!

Jr NTR Speech: ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో ఫహాద్ ఫాజిల్ హీరోగా తెరకెక్కిన ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్...
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఈవెంట్‌లో ఎన్టీఆర్ ఎమోషనల్ కామెంట్స్!

Jr NTR Speech: ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో ఫహాద్ ఫాజిల్ హీరోగా తెరకెక్కిన ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. శశాంక్ ఏలేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. అక్టోబర్ 2న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.

విడుదల తేదీ దగ్గరపడటంతో చిత్రబృందం ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.

Read Also : Prabhas Spirit : ఫౌజీ కంటే ముందే స్పిరిట్?

Jr NTR Speech
NTR’s emotional comments at the ‘Don’t Trouble the Trouble’ event!

ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. తన గాయం నుంచి పూర్తిగా కోలుకున్నానని తెలిపారు. ‘డ్రాగన్’ సినిమా ముందుగా ప్రకటించిన సమయానికే ప్రేక్షకుల ముందుకు వస్తుందని స్పష్టం చేశారు. కోవిడ్ సమయంలోనే ఫహాద్ ఫాజిల్‌లోని అద్భుతమైన నటనా ప్రతిభను గుర్తించానని చెప్పారు. బెంగళూరులో ఫహాద్ నటించిన ఓ సినిమా చూసినప్పటి నుంచి ఆయనపై అభిమానం పెరిగిందని, తాను అభిమానించే కొద్దిమంది నటుల్లో ఫహాద్ ఫాజిల్ ముందుంటారని ఎన్టీఆర్ పేర్కొన్నారు.

దేశం గర్వించదగ్గ నటుడైన ఫహాద్ ఫాజిల్ తెలుగులో లీడ్ యాక్టర్‌గా నటిస్తున్న తొలి సినిమా ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఘన విజయం సాధించాలని ఎన్టీఆర్ ఆకాంక్షించారు. అలాగే దర్శకుడిగా శశాంక్ ఏలేటికి ఈ సినిమా మంచి ఆరంభాన్ని ఇవ్వాలని కోరుకున్నారు.

Jr NTR Speech: తొలి సినిమా రోజులను గుర్తుచేసుకున్న ఎన్టీఆర్

తన సినీ కెరీర్‌ ప్రారంభ రోజులను గుర్తుచేసుకుంటూ ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. 2000 నవంబర్ 16న ‘నిన్ను చూడాలని’ సినిమా ఓపెనింగ్‌కు వెళ్లిన సమయంలో తన వెంట ఎవరూ లేరని, ఆ సమయంలో చాలా బాధపడ్డానని చెప్పారు. అయితే ఆ తర్వాత తన అభిమానుల రూపంలో దేవుడు తనకు ఎంతో గొప్ప అండను ఇచ్చాడని, వారి ప్రేమాభిమానాలు తనకు వెన్నెముకలా నిలిచాయని పేర్కొన్నారు.

అదే సమయంలో జక్కన్న (ఎస్.ఎస్. రాజమౌళి), కీరవాణి కుటుంబాలను కూడా దేవుడు తన జీవితంలో మరో కుటుంబంగా ఇచ్చాడని ఎన్టీఆర్ అన్నారు. ‘స్టూడెంట్ నంబర్ 1’ విడుదలై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ సినిమా విజయాన్ని ఇన్నేళ్ల తర్వాత రాజమౌళి కుటుంబంతో కలిసి ఒకే వేదికపై గుర్తుచేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.

ఎస్ఎస్ కార్తికేయతో ప్రత్యేక బంధం..

నిర్మాతగా మారిన ఎస్ఎస్ కార్తికేయతో తనకు ఉన్న ప్రేమానురాగాలను ఎన్టీఆర్ పంచుకున్నారు. “నాకు ఇంకో తమ్ముడు ఉంటే బాగుండేది అని అమ్మతో చెప్పేవాడిని, ఒకవేళ ఉంటే అతడే కార్తికేయ” అని ఎన్టీఆర్ చెప్పారు. తన సినిమాలు ఆడని కష్టకాలంలో ఫ్యాన్స్ ఎలా నిలబడ్డారో, కార్తికేయ కూడా అంతే అండగా నిలిచాడని గుర్తు చేసుకున్నారు. ‘బాహుబలి’, ‘RRR’ సినిమాల విజయాల వెనుక కార్తికేయ కృషి ఎంతో ఉందన్నారు. తన సంతోషంలోనూ, కష్టాల్లోనూ తోడుగా నిలిచిన కార్తికేయ నిర్మాతగా చేస్తున్న ఈ మొదటి చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ గొప్ప విజయం సాధించాలని ఎన్టీఆర్ ఆశీర్వదించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← UN అధినేత ఆంటోనియో గుటెర్రెస్‌తో జైశంకర్ భేటీఏడాదిలోపే పేదలకు సొంత ఇళ్ల తాళాలు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com