☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!

ECI Removes Annexure-D From Form-6: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ చుట్టూ నడుస్తున్న తీవ్ర వివాదాల వేళ భారత ఎన్నికల సంఘం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్త ఓటరు నమోదు కోసం పూర్తి చేసే ఫారమ్-6 తో పాటు ఎలాంటి అదనపు డిక్లరేషన్ ఫారమ్ లేదా అన్ఎక్సర్-డి (Annexure-D) సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. చట్టబద్ధమైన ఫారమ్-6 అసలు స్వరూపంలో తాము ఎలాంటి చట్టపరమైన మార్పులు చేయలేదని కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది.
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!

ECI Removes Annexure-D From Form-6: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ చుట్టూ నడుస్తున్న తీవ్ర వివాదాల వేళ భారత ఎన్నికల సంఘం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్త ఓటరు నమోదు కోసం పూర్తి చేసే ఫారమ్-6 తో పాటు ఎలాంటి అదనపు డిక్లరేషన్ ఫారమ్ లేదా అన్ఎక్సర్-డి (Annexure-D) సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. చట్టబద్ధమైన ఫారమ్-6 అసలు స్వరూపంలో తాము ఎలాంటి చట్టపరమైన మార్పులు చేయలేదని కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది.

అసలు ఈ వివాదం ఎలా మొదలైంది..?

ఓటర్ల జాబితాను మరింత ప్రక్షాళన చేసేందుకంటూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ సమయంలో ఫారమ్-6 తో పాటు ‘అన్ఎక్సర్-డి’ అనే అదనపు డిక్లరేషన్ ఫారమ్‌ను ఈసీ తప్పనిసరి చేసింది. అయితే దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవ్వడంతో, ఎన్నికల సంఘం వెనక్కి తగ్గింది. ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిన రాష్ట్రాల్లో ఆన్‌లైన్ ఫారమ్-6 నుంచి ఈ అదనపు డిక్లరేషన్ ఫారమ్‌ను తొలగించి, పాత పద్ధతినే పునరుద్ధరించింది. ఇకపై ఎస్ఐఆర్ లేని రాష్ట్రాల్లో ఎలాంటి అదనపు పత్రాలు లేకుండా పాత ఫారమ్-6 ప్రాతిపదికనే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. నిజానికి ఈ పాత ఫారమ్-6 కి, ఎస్ఐఆర్ తో కూడిన ఫారమ్-6 కి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన చోట ప్రతి ఓటరుకు సంబంధించిన తల్లిదండ్రులు, తాతముత్తాతలు లేదా కుటుంబ సీనియర్ల వివరాలు ఇప్పటికే డిజిటల్‌గా నమోదై ఉన్నాయి. కాబట్టి కొత్తగా ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు తమ కుటుంబ సభ్యుల పాత ఓటింగ్ రికార్డులను మళ్లీ సమర్పించాల్సిన పనిలేదు. కానీ ఎస్ఐఆర్ నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులు.. 2000ల ప్రారంభంలో జరిగిన పాత ఎస్ఐఆర్ సమయంలో తమ పేరు కానీ, తమ తల్లిదండ్రులు లేదా తాతముత్తాతల పేర్లు కానీ ఓటర్ల జాబితాలో ఉన్నాయో లేదో డిక్లేర్ చేయాల్సి వచ్చేది. అంతేకాకుండా తమ పూర్వపు నియోజకవర్గం సంఖ్య, పోలింగ్ బూత్ నంబర్, పాత సీరియల్ నంబర్ వంటి వివరాలను కచ్చితంగా పూర్తి చేయాల్సి వచ్చేది.

సాంకేతికంగా ఈ వివరాల నమోదు ఐచ్ఛికమే (ఆప్షనల్) అని చెప్పినప్పటికీ, ECINET పోర్టల్‌లో ఆ వివరాలు ఎంటర్ చేయకుండా ఫారమ్ ముందుకు సబ్మిట్ అయ్యేది కాదు. దీంతో ముఖ్యంగా 2000ల తర్వాత పుట్టిన 18 ఏళ్ల యువతకు, మొదటిసారి ఓటు హక్కు పొందేవారికి ఈ పాత రికార్డులు వెతికి పట్టుకోవడం పెద్ద నరకంగా మారింది. గతంలో ఏదో ఒక కారణంతో ఓటు కోల్పోయినవారు తిరిగి పేరు నమోదు చేసుకోవాలన్నా అనేక చట్టపరమైన చిక్కులు ఎదురయ్యాయి. కానీ ఇప్పుడు పాత ఫారమ్-6 విధానం రావడం వల్ల ఎలాంటి పాత కుటుంబ వివరాల మ్యాపింగ్ అవసరం లేకుండా, యువత కేవలం తమ సాధారణ వ్యక్తిగత వివరాలు, వయస్సు, నివాస ధ్రువీకరణ పత్రాలు అప్‌లోడ్ చేసి నేరుగా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

అసలు ఈ అదనపు డిక్లరేషన్ ఎందుకు తెచ్చారు?

ఈ వివాదం ఎందుకు రేగిందంటే.. ఓటర్ల జాబితాలో అక్రమాలను, అక్రమ చొరబాటుదారులను అడ్డుకోవడానికే ఎస్ఐఆర్ కింద ఈ నిబంధన తెచ్చామని ఈసీ చెప్తోంది. అయితే ఎన్నికల సంఘం నిర్ణయంపై ఈసీ అంతర్గతంగానే తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఓటరు నమోదు నిబంధనలు-1960 ప్రకారం చట్టబద్ధమైన ఫారమ్-6 లో మార్పులు చేసే అధికారం కేవలం పార్లమెంట్ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని, ఎన్నికల సంఘం తనంతట తానుగా ఆన్‌లైన్ పోర్టల్‌లో దీన్ని నిర్బంధం చేయడం కుదరదని ఎలక్షన్ కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషిలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంతర్గత విభేదాలు, వివాదాల నేపథ్యంలో ఎన్నికల సంఘం దిగివచ్చి, ఎస్ఐఆర్ పూర్తయిన రాష్ట్రాల్లో ఈ నిబంధనను ఎత్తివేసి, ప్రస్తుతం ఎస్ఐఆర్ ప్రక్రియ నడుస్తున్న రాష్ట్రాలకు మాత్రమే దాన్ని పరిమితం చేసింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలుGold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com