☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!

Gold Medal For India: ఆసియా గేమ్స్‌ 2026లో భారత ఆర్చరీ జోడీ చికితా తానిపర్తి, సాహిల్ జాదవ్ స్వర్ణ పతకం సాధించారు. కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌ ఫైనల్లో దక్షిణ కొరియాను ఓడించి భారత్‌కు మరో ఆర్చరీ గోల్డ్ అందించారు. చికితా తానిపర్తి, సాహిల్ జాదవ్ టోర్నీలో ఆరంభం నుంచి స్థిరమైన ప్రదర్శన కనబరిచారు. సెమీఫైనల్లో థాయ్‌లాండ్‌పై 156-155 తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకున్నారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో భారత జోడీ చివరి […]
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!

Gold Medal For India: ఆసియా గేమ్స్‌ 2026లో భారత ఆర్చరీ జోడీ చికితా తానిపర్తి, సాహిల్ జాదవ్ స్వర్ణ పతకం సాధించారు. కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌ ఫైనల్లో దక్షిణ కొరియాను ఓడించి భారత్‌కు మరో ఆర్చరీ గోల్డ్ అందించారు.

చికితా తానిపర్తి, సాహిల్ జాదవ్ టోర్నీలో ఆరంభం నుంచి స్థిరమైన ప్రదర్శన కనబరిచారు. సెమీఫైనల్లో థాయ్‌లాండ్‌పై 156-155 తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకున్నారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో భారత జోడీ చివరి వరకు ఒత్తిడిని అధిగమించింది.

చికితా తానిపర్తికి ఈ విజయం ప్రత్యేకంగా నిలిచింది. ఇప్పటికే మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌లో జ్యోతి సురేఖ వెన్నం, పృథికా ప్రదీప్‌తో కలిసి ఆమె స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో చైనాను ఓడించి భారత్‌కు గోల్డ్ అందించారు. మరోవైపు సాహిల్ జాదవ్ కూడా ఆసియా గేమ్స్‌లో భారత కాంపౌండ్ ఆర్చరీ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నారు. పురుషుల కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌లోనూ అతడు భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కాంపౌండ్ ఆర్చరీలో భారత్ అద్భుత ప్రదర్శన కొనసాగుతుండగా.. చికితా, సాహిల్ సాధించిన ఈ స్వర్ణం భారత పతకాల ఖాతాలో మరో మెరుపును జోడించింది.

ప్రస్తుతం ఆసియా గేమ్స్‌ 2026లో భారత్ ఖాతాలో 8 బంగారు, 21 సిల్వర్, 27 బ్రోన్జ్ మెడల్స్ ఉన్నాయి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!AI Videos Political War: టీడీపీ వర్సెస్‌ వైసీపీ.. ఏఐ పొలిటికల్‌ ఫైట్.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com