☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

AI Videos Political War: టీడీపీ వర్సెస్‌ వైసీపీ.. ఏఐ పొలిటికల్‌ ఫైట్..

AI Videos Political War: రోజు రోజుకీ టెక్నాలజీ అప్‌డేట్‌ అవుతుంది.. అది కూడా అందిపుచ్చుకుంటున్నారు రాజకీయ నేతలు.. ఇప్పుడు అంతా ఏఐ వీడియోల కాలం నడుస్తుండగా.. మేమేం తక్కువ అన్నట్టు.. ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు గుప్పించుకోవడానికి కూడా ఏఐ వాడేస్తున్నారు.. ఇక, చిత్తూరు నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్‌ వైసీపీ రాజకీయ పోరు కొత్త రూపు దాల్చింది. సోషల్‌ మీడియా వేదికగా ఇరు పార్టీల నేతలు ఏఐ వీడియోలతో పరస్పరం విమర్శలు చేసుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది. […]
AI Videos Political War: టీడీపీ వర్సెస్‌ వైసీపీ.. ఏఐ పొలిటికల్‌ ఫైట్..

AI Videos Political War: రోజు రోజుకీ టెక్నాలజీ అప్‌డేట్‌ అవుతుంది.. అది కూడా అందిపుచ్చుకుంటున్నారు రాజకీయ నేతలు.. ఇప్పుడు అంతా ఏఐ వీడియోల కాలం నడుస్తుండగా.. మేమేం తక్కువ అన్నట్టు.. ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు గుప్పించుకోవడానికి కూడా ఏఐ వాడేస్తున్నారు.. ఇక, చిత్తూరు నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్‌ వైసీపీ రాజకీయ పోరు కొత్త రూపు దాల్చింది. సోషల్‌ మీడియా వేదికగా ఇరు పార్టీల నేతలు ఏఐ వీడియోలతో పరస్పరం విమర్శలు చేసుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది.

వైసీపీ ఇన్‌చార్జి విజయానందరెడ్డి, ఆయన అనుచరులపై ఆరోపణలు చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే గురజాల వీడియో పోస్టు చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌, ఇసుక, భూ దందాలతో కోట్లు దోచేశారని‌.. అక్రమ లిక్కర్ వ్యాపారం చేశారంటూ అందులో ఆరోపణలు చేశారు. దీనికి వైసీపీ సోషల్‌ మీడియా నుంచి ఘాటైన కౌంటర్‌ వచ్చింది. ఎమ్మెల్యేను టార్గెట్‌ చేస్తూ ‘బటర్‌ బన్ను ఎమ్మెల్యే’ అంటూ ఏఐ వీడియోను రూపొందించింది. రెండేళ్లుగా చిత్తూరు ఎమ్మెల్యేగా ఉంటూ భూములు, ఇసుక, గ్రావెల్‌, గ్రానైట్‌ వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేసింది. టోకెన్‌ అడ్వాన్స్‌ల పేరుతో భూములు కబ్జా చేస్తున్నారంటూ వైసీపీ వీడియోలో విమర్శలు చేసింది.వ్యక్తిగత విమర్శలతో‌పాటు వారి వారి అనుచరులు చిట్టా ఇరు పార్టీలు బయట పెట్టాయి.. దీంతో చిత్తూరులో రాజకీయ విమర్శలు ఇప్పుడు బహిరంగ సభలు, ప్రెస్‌ మీట్లను దాటి ఏఐ వీడియోల రూపంలో సోషల్‌ మీడియాలోకి చేరాయి. ప్రస్తుతం ఈ విడియోలు వైరల్ గా మారాయి…

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com