☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కాక్రోచ్ పార్టీ 2.0 అట్టర్ ఫ్లాప్ : ఎగతాళి చేస్తున్న బీజేపీ • Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందంటే? • విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సుస్మిత కొణిదెల • న్యాయవాదుల నిర్బంధంపై సీజేఐ జోక్యానికి SCBA విజ్ఞప్తి • Penguins: పెరుగుతున్న భూతాపం.. పిట్టల్లా రాలిపోతున్న పెంగ్విన్లు.. • నితిన్ కొత్త సినిమాలో..రుక్మిణీగా బాలీవుడ్ నటి? • తెలుగు అబ్బాయిలంటే ఇష్టం.. పెళ్లి కూడా చేసుకుంటా..! హీరోయిన్ క్రేజీ కామెంట్స్ • కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నాయనమ్మ కన్నుమూత •

అంబటిపై గురిపెట్టిన ఈడీ..? అరెస్ట్ కు రంగం సిద్దం..?

ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసిన గత ప్రభుత్వ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ఊహించని మలుపులు తిరుగుతోంది. మనీలాండరింగ్ కోణంలో కూపీ లాగుతున్న ఈడీ అధికారులు.. ఇప్పటికే ఈ స్కామ్‌తో సంబంధం ఉన్న కీలక నేతలు, అధికారులను వరుసగా కటకటాల వెనక్కి నెట్టారు. ఇదే క్రమంలో తాజాగా మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. నోటీసుల అనంతరం ఆయనను […] The post అంబటిపై గురిపెట్టిన ఈడీ..? అరెస్ట్ కు రంగం సిద్దం..? appeared first on Telugu Rajyam.
అంబటిపై గురిపెట్టిన ఈడీ..? అరెస్ట్ కు రంగం సిద్దం..?

ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసిన గత ప్రభుత్వ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ఊహించని మలుపులు తిరుగుతోంది. మనీలాండరింగ్ కోణంలో కూపీ లాగుతున్న ఈడీ అధికారులు.. ఇప్పటికే ఈ స్కామ్‌తో సంబంధం ఉన్న కీలక నేతలు, అధికారులను వరుసగా కటకటాల వెనక్కి నెట్టారు. ఇదే క్రమంలో తాజాగా మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. నోటీసుల అనంతరం ఆయనను కూడా అరెస్ట్ చేసేందుకు ఈడీ పూర్తిస్థాయిలో రంగం సిద్ధం చేసినట్లు ఢిల్లీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ జరిపిన మెరుపు దాడులు, సుదీర్ఘ విచారణల అనంతరం కీలకమైన వ్యక్తులను ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు కారుమూరి సునీల్ కుమార్, ఏపీఎస్‌బీసీఎల్ మాజీ ఎండీ డి. వాసుదేవ రెడ్డి, ప్రముఖ మద్యం వ్యాపారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తదితరులు ఈ కేసులో ప్రధాన నిందితులుగా విజయవాడ జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, బినామీ కంపెనీల ద్వారా భారీగా నిధుల మళ్ళింపునకు పాల్పడ్డారనే పక్కా ఆధారాలతోనే వీరందరినీ ఈడీ అరెస్ట్ చేసింది.

ఒకవైపు కారుమూరి నాగేశ్వరరావు అండ్ గ్యాంగ్ జైల్లో విచారణ ఎదుర్కొంటుండగానే.. ఇప్పుడు అంబటి రాంబాబు చుట్టూ ఈడీ ఉచ్చు బిగుస్తోంది. జైల్లో ఉన్న నిందితులు ఇచ్చిన వాంగ్మూలం మరియు డిజిటల్ ఆధారాల ప్రకారమే అంబటికి నోటీసులు అందినట్లు తెలుస్తోంది. ఈ విచారణలో గనుక ఆర్థిక లావాదేవీలపై సరైన సమాధానాలు రాకుంటే, జైల్లో ఉన్న మిగతా నేతల తరహాలోనే అంబటి రాంబాబు అరెస్ట్ కూడా ఖాయమనే సంకేతాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ తాజా పరిణామం వైసీపీ శ్రేణుల్లో తీవ్ర కలవరాన్ని రేపుతోంది.

The post అంబటిపై గురిపెట్టిన ఈడీ..? అరెస్ట్ కు రంగం సిద్దం..? appeared first on Telugu Rajyam.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ఆ మంత్రి పదవి నాకే కావాలి.. సుజనా చౌదరి పట్టు..!లోకేష్ ‘డీజే’ ఆర్డర్లపై సొంత పార్టీలోనే సెటైర్లు..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com