☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

లోకేష్ ‘డీజే’ ఆర్డర్లపై సొంత పార్టీలోనే సెటైర్లు..!

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సొంత పార్టీ శ్రేణులతో పాటు సాధారణ నెటిజన్ల నుంచి కూడా తీవ్ర విమర్శలకు, వెటకారాలకు దారితీస్తోంది. గణేష్ నిమజ్జనం వేడుకల్లో డీజే వాహనాలకు పోలీసులు పర్మిషన్లు ఇవ్వడం లేదంటూ మంత్రి లోకేష్ నేరుగా హోం మంత్రి అనిత, డీజీపీలకు ఎక్స్ వేదికగా బహిరంగ ఆదేశాలు జారీ చేశారు. డీజే వాహనాలను అస్సలు సీజ్ చేయవద్దంటూ ఆయన […] The post లోకేష్ ‘డీజే’ ఆర్డర్లపై సొంత పార్టీలోనే సెటైర్లు..! appeared first on Telugu Rajyam.
లోకేష్ ‘డీజే’ ఆర్డర్లపై సొంత పార్టీలోనే సెటైర్లు..!
Nara Lokesh and YS Jagan amid APPSC DSC controversy and social media reactions

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సొంత పార్టీ శ్రేణులతో పాటు సాధారణ నెటిజన్ల నుంచి కూడా తీవ్ర విమర్శలకు, వెటకారాలకు దారితీస్తోంది. గణేష్ నిమజ్జనం వేడుకల్లో డీజే వాహనాలకు పోలీసులు పర్మిషన్లు ఇవ్వడం లేదంటూ మంత్రి లోకేష్ నేరుగా హోం మంత్రి అనిత, డీజీపీలకు ఎక్స్ వేదికగా బహిరంగ ఆదేశాలు జారీ చేశారు. డీజే వాహనాలను అస్సలు సీజ్ చేయవద్దంటూ ఆయన పెట్టిన ఈ పోస్టు సోషల్ మీడియాలో పెద్ద రచ్చకు తెరలేపింది.

ఈ వ్యవహారంపై నెటిజన్లతో పాటు కొందరు సీనియర్ టీడీపీ సానుభూతిపరులు కూడా లోకేష్ ట్వీట్‌ను తీవ్రంగా తప్పుబడుతున్నారు. “అసలు దేశంలో 2000 సంవత్సరంలోనే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘నాయిస్ పొల్యూషన్ కంట్రోల్ రూల్స్’ అనేవి ఒకటి ఉన్నాయనే సంగతి ఇద్దరు మంత్రులలో ఎవరికైనా తెలుసా..?” అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. పోలీస్ శాఖ నిబంధనల ప్రకారం నడుచుకోవాలా లేక ఎక్స్ పోస్టులలో వచ్చే పొలిటికల్ ఆర్డర్ల ప్రకారం నడుచుకోవాలా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ఇక ఈ ట్వీట్‌కు హోం మంత్రి వంగలపూడి అనిత స్పందిస్తూ.. డీజే పర్మిషన్లను నిబంధనల ప్రకారం ప్రాసెస్ చేయాలని పోలీసులకు ఆదేశాలిచ్చామని, ఉత్సవాలు ‘హిందూ ధర్మం’ యొక్క రీతినే ప్రతిబింబించాలని రిప్లై ఇవ్వడం మరో కామెడీగా మారింది. దీనిపై సీనియర్ విశ్లేషకులు స్పందిస్తూ.. “భక్తి శ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితి వేడుకలకు, చెవులు పగిలిపోయేలా రికార్డు డాన్సుల పాటలతో పెట్టే డీజే సౌండ్లకు, అసలు హిందూ ధర్మానికి ఉన్న సంబంధం ఏంటో ఆ హోం మంత్రి గారికే తెలియాలి” అంటూ ఎద్దేవా చేస్తున్నారు. సొంత శాఖ కాని పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు లోకేష్ ఇలా ఓపెన్‌గా హుకుం జారీ చేయడం, దానికి హోం మంత్రి డిఫెన్సివ్‌గా సమాధానం ఇచ్చుకోవడం చూస్తుంటే.. ప్రభుత్వంలో నిబంధనల కంటే ట్విట్టర్ పాలిటిక్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

The post లోకేష్ ‘డీజే’ ఆర్డర్లపై సొంత పార్టీలోనే సెటైర్లు..! appeared first on Telugu Rajyam.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← అంబటిపై గురిపెట్టిన ఈడీ..? అరెస్ట్ కు రంగం సిద్దం..?ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com