☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Fire Accident | మెర్సిడెస్ బెంజ్ కార్ల‌ వర్క్‌షాప్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది ల‌గ్జ‌రీ కార్లు, ఖ‌రీదైన సామాగ్రి ద‌గ్ధం..!

Fire Accident | రాజస్థాన్‌ (Rajasthan) రాజధాని జైపూర్‌ (Jaipur) లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సంగనేర్ సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ మార్కెట్‌ (Balaji Market) లో ఉన్న ఓ మెర్సిడెస్ బెంజ్ కార్ల‌ వర్క్‌షాప్‌ (Mercedes Benz Cars Workshop) లో గ‌త‌ రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Fire Accident | మెర్సిడెస్ బెంజ్ కార్ల‌ వర్క్‌షాప్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది ల‌గ్జ‌రీ కార్లు, ఖ‌రీదైన సామాగ్రి ద‌గ్ధం..!

Fire Accident : రాజస్థాన్‌ (Rajasthan) రాజధాని జైపూర్‌ (Jaipur) లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సంగనేర్ సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ మార్కెట్‌ (Balaji Market) లో ఉన్న ఓ మెర్సిడెస్ బెంజ్ కార్ల‌ వర్క్‌షాప్‌ (Mercedes Benz Cars Workshop) లో గ‌త‌ రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో సుమారు 8 లగ్జరీ కార్లు, కార్ల‌ ఖరీదైన విడిభాగాలు, ఇతర యాక్సెసరీలు కాలి బూడిదయ్యాయి. ప్రమాద తీవ్రతకు దాదాపు 5 కిలోమీటర్ల దూరం వరకు దట్టమైన పొగలు వ్యాపించాయి.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు 10 ఫైరింజన్ల సాయంతో రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగినప్పుడు వర్క్‌షాప్‌లో కొత్తవి, పాతవి కలిపి 50కి పైగా కార్లు ఉన్నాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో సుమారు 8 కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి మిగిలిన కార్లను సురక్షితంగా బయటకు తరలించడంతో పెను నష్టం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టంచేశారు.

ముందుజాగ్రత్త చర్యగా సమీప ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ప్రాథమిక విచారణ ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రమాదానికి కచ్చితమైన కారణం తేలాల్సి ఉందని, దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. కాలిపోయిన వాహనాలు, విడిభాగాలవల్ల జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలావుంటే అంత‌కుముందు జైపూర్‌లోని నారాయణ్ సింగ్ సర్కిల్ సమీపంలో ఉన్న ఓ మాల్‌లో కూడా మధ్యాహ్నం 2 గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← రిమ్స్ హాస్పిటల్‌లో ప్రమాదంలో 5కు చేరిన చిన్నారుల మృతుల సంఖ్య.. మరో 20 మంది పరిస్థితి విషమంSarvapindi | మైత్రీ థియేట‌ర్‌ల‌లో స్నాక్‌గా సర్వపిండి.. ‘ది ప్యారడైజ్’తో ఎంట్రీ! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com