☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కాక్రోచ్ పార్టీ 2.0 అట్టర్ ఫ్లాప్ : ఎగతాళి చేస్తున్న బీజేపీ • Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందంటే? • విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సుస్మిత కొణిదెల • న్యాయవాదుల నిర్బంధంపై సీజేఐ జోక్యానికి SCBA విజ్ఞప్తి • Penguins: పెరుగుతున్న భూతాపం.. పిట్టల్లా రాలిపోతున్న పెంగ్విన్లు.. • నితిన్ కొత్త సినిమాలో..రుక్మిణీగా బాలీవుడ్ నటి? • తెలుగు అబ్బాయిలంటే ఇష్టం.. పెళ్లి కూడా చేసుకుంటా..! హీరోయిన్ క్రేజీ కామెంట్స్ • కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నాయనమ్మ కన్నుమూత •

Viral News | కొందరికి చాక్లెట్స్ కొంద‌రికి ఐఫోన్‌లు.. ఖ‌రీదైన గిప్టుల‌తో ఉద్యోగుల‌కు బాస్ స‌డెన్ స‌ర్‌ప్రైజ్‌..!

Viral News | కొన్ని కంపెనీలు (Companies) త‌మ ఉద్యోగుల‌ (Employees) ప‌ట్ల ప్రేమ‌తో పండుగ‌లు ప‌బ్బాల (Festivals) వేళ కానుక‌లు అంద‌జేస్తాయి. బోన‌స్‌ల వంటివి కూడా ప్ర‌క‌టిస్తాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగుల‌కు జీతం ఇస్తున్నాం క‌దా.. ఇంకా గిఫ్టులు, బోన‌స్‌లు ఎందుకు అని స‌రిపెట్టుకుంటాయి. మ‌రికొన్ని కంపెనీలు ఉద్యోగుల‌కు జీతాలు కూడా స‌రిగా ఇవ్వ‌కుండా.. ఏండ్ల‌కు ఏండ్లు వేత‌నాలు పెంచ‌కుండా వెట్టిచాకిరీ చేయించుకుంటాయి.
Viral News | కొందరికి చాక్లెట్స్ కొంద‌రికి ఐఫోన్‌లు.. ఖ‌రీదైన గిప్టుల‌తో ఉద్యోగుల‌కు బాస్ స‌డెన్ స‌ర్‌ప్రైజ్‌..!

Viral News : కొన్ని కంపెనీలు (Companies) త‌మ ఉద్యోగుల‌ (Employees) ప‌ట్ల ప్రేమ‌తో పండుగ‌లు ప‌బ్బాల (Festivals) వేళ కానుక‌లు అంద‌జేస్తాయి. బోన‌స్‌ల వంటివి కూడా ప్ర‌క‌టిస్తాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగుల‌కు జీతం ఇస్తున్నాం క‌దా.. ఇంకా గిఫ్టులు, బోన‌స్‌లు ఎందుకు అని స‌రిపెట్టుకుంటాయి. మ‌రికొన్ని కంపెనీలు ఉద్యోగుల‌కు జీతాలు కూడా స‌రిగా ఇవ్వ‌కుండా.. ఏండ్ల‌కు ఏండ్లు వేత‌నాలు పెంచ‌కుండా వెట్టిచాకిరీ చేయించుకుంటాయి. కానీ యూఏఈ (UAE) కి చెందిన ఓ కంపెనీ బాస్ (Boss) మాత్రం ఉద్యోగుల‌ప‌ట్ల త‌న ఉదార‌త‌ను చాటుకున్నారు. ఆ బాస్ చూపిన ఉదార‌త‌పై సోషల్ మీడియా (Social Media) లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఆ కంపెనీ ఉద్యోగులందరినీ ఆశ్చర్యపరుస్తూ ఖరీదైన ఐఫోన్లను బహుమతులుగా ఇచ్చింది. అయితే ఈ బహుమతులు అంద‌జేసే విధానంలో కంపెనీ యాజ‌మాన్యం ఉద్యోగుల బావోద్వేగాల‌తో స‌ర‌దాగా ఆడుకుంది. ఈ విధానం కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్షంగా చూస్తున్న వారిలో ఉత్కంఠ రేపింది. యూఏఈ కేంద్రంగా పనిచేస్తున్న ‘వరల్డ్ స్టార్ మ్యాన్‌పవర్’ అనే సంస్థ తమ ఉద్యోగుల కోసం ఈ బ‌హుమ‌తి ప్ర‌దాన కార్యక్రమాన్ని నిర్వహించింది. కంపెనీ వ్యవస్థాపకుడు నిషాద్ హుస్సేన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన ఆయన భార్య హసీనా నిషాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కార్య‌క్ర‌మంలో భాగంగా ఉద్యోగులందరినీ మీటింగ్ హాల్‌లోకి పిలిచారు. అప్ప‌టికే టేబుల్‌పై ఉంచిన గిఫ్ట్ బాక్సులలో ఎవ‌రికి న‌చ్చినదాన్ని వారు ఎంచుకోవాల‌ని సూచించారు. ఎంతో ఉత్సాహంగా ఆ గిఫ్టు బాక్సులను అందుకున్న కొంద‌రు ఉద్యోగులు సంతోష‌ప‌డ‌గా, మ‌రికొంద‌రు నిరాశ‌కు గుర‌య్యారు. ఎందుకంటే కొంద‌రి గిఫ్టు బాక్సుల‌లో చాక్లెట్స్ మాత్ర‌మే ఉండ‌గా.. కొంద‌రి గిఫ్టు బాక్సుల‌తో ఐఫోన్‌లు కూడా ఉన్నాయి. దాంతో ఐఫోన్‌లు రాని ఉద్యోగులు త‌మ‌ను చిన్న‌చూపు చూశార‌ని బాధ‌ప‌డుతూ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

కానీ కార్య‌క్ర‌మం చివర‌లో నిరాశ చెందిన ఉద్యోగుల క‌ళ్ల‌లో కూడా ఆనందం వెల్లివిరిసింది. ఎందుకుంటే కంపెనీ ఎండీ హసీనా నిషాద్.. చాక్లెట్లు మాత్ర‌మే పొందిన ప్రతి ఉద్యోగికి స్వ‌యంగా త‌న చేతుల‌తో ఐఫోన్‌లు అందజేశారు. ఏ ఒక్కరినీ నిరాశపరచకుండా అందరికీ ఒకే రకమైన బహుమతులు అందించి యాజమాన్యం త‌న ఉద్యోగుల‌ మనసులు గెలుచుకుందని అంతా ప్ర‌శంసిస్తున్నారు. నెటిజ‌న్‌ల నుంచి కూడా వారిపై ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎండీ హసీనా నిషాద్ ఒక సందేశాన్ని పంచుకున్నారు. ఒక సంస్థ నిజమైన విజయం అనేది ఉద్యోగుల అంకితభావం, సానుకూల దృక్పథం, సమష్టి బలం మీదనే ఆధారపడి ఉంటుందని త‌న సందేశంలో పేర్కొన్నారు. కంపెనీ పురోగతిలో ప్రతి ఒక్కరి కృషి ఎంతో విలువైన‌దని, మనం ప్రమాణాలను పెంచుకుంటూ, ఒకరికొకరు మద్దతుగా నిలుద్దామ‌ని ఉద్యోగుల‌కు పిలుపునిచ్చారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Ambati Rambabu | అంబ‌టి రాంబాబుకు మరోసారి ఈడీ నోటీసులు.. ఈనెల 28న హాజరుకావాలని ఆదేశాలు‘పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం’ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com