☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Ambati Rambabu | అంబ‌టి రాంబాబుకు మరోసారి ఈడీ నోటీసులు.. ఈనెల 28న హాజరుకావాలని ఆదేశాలు

Ambati Rambabu | ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం మరోసారి నోటీసులు జారీచేసింది.
Ambati Rambabu | అంబ‌టి రాంబాబుకు మరోసారి ఈడీ నోటీసులు.. ఈనెల 28న హాజరుకావాలని ఆదేశాలు

అమరావతి : ఏపీ మద్యం రవాణా కుంభకోణం ( Liquor Scam ) కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ( Ambati Rambabu ) కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం మరోసారి నోటీసులు జారీచేసింది. రెండు రోజుల క్రితం ఆయనకు శుక్రవారం ఉ దయం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఫోన్ ద్వారా సమాచారం అందించారు.

తనకు 15 రోజుల క్రితం గుండెకు స్టంట్‌లు వేయించుకున్నానని, డాక్టర్ల సలహా మేరకు ప్రస్తుతం కోలుకుంటున్నానని, తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ తాను విచార‌ణ‌కు రాలేన‌ని వివరించారు. దీంతో శుక్రవారం మరోసారి అంబటికి నోటీలసులు జారీ చేసి సోమవారం రావాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాలకు లిక్కర్ రవాణా కోసం సిగ్మా, ప్రసాద్ ట్రాన్స్‌పోర్ట్ సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టినట్లు ఈడీ గుర్తించింది.

తొలి కాంట్రాక్టు కాలంలో వీరిద్దరూ కలిసి సుమారు 59.14 లక్షల మద్యం పెట్టెలు రవాణా చేశారని అధికారులు గుర్తించారు. సిగ్మా సంస్థ నుంచి రూ.15.44 కోట్లు అందుకున్నట్లు విచారణలో వెల్లడైంది. సబ్‌కాంట్రాక్టులు, నిధుల మళ్లింపు, అంబటి రాంబాబుతో ఉన్న సంబంధాలపై కూడా వారిని వివరాలు అడిగారు. ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలను అధికంగా పెంచడంవల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.195 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ఈడీ లెక్కలు చూపిస్తోంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Health Tips | చిప్స్ తినుకుంటూ కూల్ డ్రింక్స్ తాగితే యమ డేంజర్‌.. ఎందుకో తెలుసా..?Viral News | కొందరికి చాక్లెట్స్ కొంద‌రికి ఐఫోన్‌లు.. ఖ‌రీదైన గిప్టుల‌తో ఉద్యోగుల‌కు బాస్ స‌డెన్ స‌ర్‌ప్రైజ్‌..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com