☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కాక్రోచ్ పార్టీ 2.0 అట్టర్ ఫ్లాప్ : ఎగతాళి చేస్తున్న బీజేపీ • Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందంటే? • విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సుస్మిత కొణిదెల • న్యాయవాదుల నిర్బంధంపై సీజేఐ జోక్యానికి SCBA విజ్ఞప్తి • Penguins: పెరుగుతున్న భూతాపం.. పిట్టల్లా రాలిపోతున్న పెంగ్విన్లు.. • నితిన్ కొత్త సినిమాలో..రుక్మిణీగా బాలీవుడ్ నటి? • తెలుగు అబ్బాయిలంటే ఇష్టం.. పెళ్లి కూడా చేసుకుంటా..! హీరోయిన్ క్రేజీ కామెంట్స్ • కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నాయనమ్మ కన్నుమూత •

Health Tips | చిప్స్ తినుకుంటూ కూల్ డ్రింక్స్ తాగితే యమ డేంజర్‌.. ఎందుకో తెలుసా..?

Health Tips | వేసవిలో చాలామంది చల్లని పానీయాలు తాగడానికి ఇష్టపడతారు. ఇవి చాలా రుచిగా ఉండటంతోపాటు వెంటనే చల్లదనం కూడా ఇస్తాయి. అయితే కొందరు ఈ పానీయాలతోపాటు చిప్స్ కూడా తింటారు. కొందరిలో సాధారణంగా కనిపించే ఈ అలవాటు ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Health Tips | చిప్స్ తినుకుంటూ కూల్ డ్రింక్స్ తాగితే యమ డేంజర్‌.. ఎందుకో తెలుసా..?

Health Tips : వేసవిలో చాలామంది చల్లని పానీయాలు తాగడానికి ఇష్టపడతారు. ఇవి చాలా రుచిగా ఉండటంతోపాటు వెంటనే చల్లదనం కూడా ఇస్తాయి. అయితే కొందరు ఈ పానీయాలతోపాటు చిప్స్ కూడా తింటారు. కొందరిలో సాధారణంగా కనిపించే ఈ అలవాటు ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి అలవాటు ఉంటే తక్షణమే మానుకోవాలని సూచిస్తున్నారు. కూల్‌డ్రింక్స్‌తో చిప్స్‌ తింటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

చల్లని పానీయాలలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. కొన్నింటిలో కెఫీన్ కూడా ఉంటుంది. ఇవి తాగినప్పుడు తాత్కాలికంగా దాహం తగ్గినట్లు అనిపించినా, వాస్తవానికి శరీరంలో నీరు తగ్గే అవకాశం ఉంది. అంటే డీ హైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల నీరసం, తల తిరగడం, అలసట వంటి సమస్యలు రావచ్చు. వేసవిలో శరీరానికి తగినంత నీరు అవసరం కాబట్టి నీటిని శాతాన్ని తగ్గించ కూల్‌డ్రింక్స్‌ తాగడం మరింత ప్రమాదకరం.

ఇక చిప్స్ విషయానికి వస్తే.. చిప్స్‌లో ఉప్పు, హానికరమైన కొవ్వులు (ట్రాన్స్ ఫ్యాట్స్) ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో నీటిని తగ్గించడమే కాకుండా, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కూడా దెబ్బతీస్తాయి. దాంతో దాహం మరింత పెరుగుతుంది. ఫలితంగా మళ్లీ మళ్లీ చల్లని పానీయాలు తాగే అలవాటు పెరుగుతుంది. దీర్ఘకాలంలో బరువు పెరగడం, జీర్ణ సమస్యలు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.

అందుకే కూల్‌డ్రింక్స్‌ తరచూ తాగే అలవాటు ఉన్నవాళ్లు వాటికి బదులుగా నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి సహజ పానీయాలు తాగడం మంచిది. ఇవి శరీరానికి తేమను అందించి, ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అదేవిధంగా కూల్‌డ్రింక్స్‌తోపాటు చిప్స్‌కు బదులుగా వేయించిన మఖానా, వేరుశెనగలు లేదా తాజా పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Landslides | సిక్కింలో విరిగిపడిన భారీ కొండచరియలుAmbati Rambabu | అంబ‌టి రాంబాబుకు మరోసారి ఈడీ నోటీసులు.. ఈనెల 28న హాజరుకావాలని ఆదేశాలు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com