☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి: విద్యా కమిషన్ మాజీ చైర్మన్

ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి: విద్యా కమిషన్ మాజీ చైర్మన్ Caption of Image. మహబూబ్‌‌‌‌నగర్ అర్బన్, వెలుగు: ప్రైవేట్​ స్కూళ్ల ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని విద్యా కమిషన్​ మాజీ చైర్మన్​​ఆకునూరి మురళి డిమాండ్​ చేశారు. తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్(టీపీఎఫ్) ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర బుధవారం మహబూబ్​నగర్​ చేరుకుంది. టీపీఎఫ్​ ఆధ్వర్యంలో నగరంలోని ప్రెస్​క్లబ్​లో రౌండ్​ టేబుల్​ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల భారంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయని చెప్పారు. అడ్మిషన్ ఫీజు, బిల్డింగ్ ఫండ్, పుస్తకాలు, యూనిఫాం, రవాణా తదితర పేర్లతో తల్లిదండ్రులపై అదనపు భారం మోపి దోపిడీ చేస్తున్నారన్నారు. ప్రైవే
ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి: విద్యా కమిషన్ మాజీ చైర్మన్
ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి: విద్యా కమిషన్ మాజీ చైర్మన్

మహబూబ్‌‌‌‌నగర్ అర్బన్, వెలుగు: ప్రైవేట్​ స్కూళ్ల ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని విద్యా కమిషన్​ మాజీ చైర్మన్​​ఆకునూరి మురళి డిమాండ్​ చేశారు. తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్(టీపీఎఫ్) ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర బుధవారం మహబూబ్​నగర్​ చేరుకుంది.

టీపీఎఫ్​ ఆధ్వర్యంలో నగరంలోని ప్రెస్​క్లబ్​లో రౌండ్​ టేబుల్​ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల భారంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయని చెప్పారు. అడ్మిషన్ ఫీజు, బిల్డింగ్ ఫండ్, పుస్తకాలు, యూనిఫాం, రవాణా తదితర పేర్లతో తల్లిదండ్రులపై అదనపు భారం మోపి దోపిడీ చేస్తున్నారన్నారు.

ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమిషన్, చట్టాన్ని వెంటనే ఆమోదించి సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. సర్కారు స్కూళ్లను బలోపేతం చేయడంతో పాటు మౌలిక వసతులు, నాణ్యమైన విద్య, టీచర్ల కొరత వంటి సమస్యలను పరిష్కరించాలన్నారు.

రాష్ట్ర వార్షిక బడ్జెట్‌‌‌‌లో 18 శాతం నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ పద్మజ, రిటైర్డ్ ఐఏఎస్ ఎండీ రెడ్డి, టీపీఎఫ్​ సభ్యులు సృజన యాదవ్, ముప్పూరి కుమారన్న, నిఖిల్, విజయ్ కృష్ణ, పాలకూరి అశోక్ కుమార్, మట్టగళ్ల వెంకటయ్య, బి.నాగన్న పాల్గొన్నారు.

html, body,
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← గణేశ్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి : మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్బెల్లంపల్లి: ఆన్‌‌‌‌లైన్ బెట్టింగ్స్‌‌‌‌కు అలవాటు పడి..అప్పుల పాలై వ్యక్తి సూసైడ్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com