☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

గణేశ్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి : మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్

గణేశ్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి : మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్
గణేశ్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి : మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్
గణేశ్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి : మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్

దండేపల్లి, వెలుగు: గణేశ్‌‌‌‌ నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో సజావుగా జరుపుకోవాలని, ఇందుకు అవసరమైన పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం దండేపల్లి మండలం గూడెంలో గోదావరి తీరంలో నిమజ్జన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం ద్వారక గ్రామంలో కొనసాగుతున్న ఎస్‌‌‌‌టీ బాయ్స్‌‌‌‌ హాస్టల్‌‌‌‌ను పరిశీలించారు.

జడ్పీ హైస్కూల్‌‌‌‌లో తరగతి గదులు, రిజిస్టర్లు, విద్యాబోధన, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తూ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. 9వ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యాసన సామర్థ్యాలను పరీక్షించారు. మండల కేంద్రంలోని కేజీబీవీని సందర్శించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలన్నారు. మండల కేంద్రంలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించారు. కలెక్టర్‌‌‌‌‌‌‌‌ వెంట తహసీల్దార్ రోహిత్ దేశ్ పాండే, ఎంపీడీవో జేఆర్‌‌‌‌‌‌‌‌ ప్రసాద్, ఎస్ఐ రాజావర్ధన్ తదితరులు ఉన్నారు.

html, body,
⬇ Full News JPG⬇ Short News JPG
← వెళ్లొస్తా.. వచ్చే ఏటికి మళ్లొస్తా...! ఓరుగల్లులో భక్తిశ్రద్దలతో వినాయక నిమజ్జనాలుఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి: విద్యా కమిషన్ మాజీ చైర్మన్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com