☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

హైదరాబాద్ మీర్‌పేట్‌లో నడిరోడ్డుపై తగలబడ్డ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

హైదరాబాద్ మీర్‌పేట్‌లో నడిరోడ్డుపై తగలబడ్డ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు Caption of Image. హైదరాబాద్: మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి బస్సులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నాగోలుకు చెందిన శ్రీ మహాలక్ష్మి రియల్ ఎస్టేట్‌కు చెందిన సుమారు 150 మంది గణేష్ విగ్రహ నిమజ్జనం, దర్శనం కోసం మూడు బస్సుల్లో శ్రీశైలానికి బయలుదేరారు. రాత్రి సుమారు 2 గంటల సమయంలో గాయత్రి నగర్ సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద రెండు బస్సుల్లో డీజిల్ పోస్తుండగా.. ప్రధాన రహదారిపై నిలిపి ఉన్న TS 15 T 8558 నంబర్ శ్రీ లక్ష్మీ నరసింహ ట్రావెల్స్ బస్సులో కుడివైపు ఇంజిన్ భాగం నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నారు. మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే బస్సు దిగి ప్రయాణికులను అప్రమత్తం చే
హైదరాబాద్ మీర్‌పేట్‌లో నడిరోడ్డుపై తగలబడ్డ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
హైదరాబాద్ మీర్‌పేట్‌లో నడిరోడ్డుపై తగలబడ్డ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

హైదరాబాద్: మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి బస్సులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నాగోలుకు చెందిన శ్రీ మహాలక్ష్మి రియల్ ఎస్టేట్‌కు చెందిన సుమారు 150 మంది గణేష్ విగ్రహ నిమజ్జనం, దర్శనం కోసం మూడు బస్సుల్లో శ్రీశైలానికి బయలుదేరారు.

రాత్రి సుమారు 2 గంటల సమయంలో గాయత్రి నగర్ సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద రెండు బస్సుల్లో డీజిల్ పోస్తుండగా.. ప్రధాన రహదారిపై నిలిపి ఉన్న TS 15 T 8558 నంబర్ శ్రీ లక్ష్మీ నరసింహ ట్రావెల్స్ బస్సులో కుడివైపు ఇంజిన్ భాగం నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నారు.

మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే బస్సు దిగి ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో.. అందరూ సురక్షితంగా బయటకు వచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదు. సమాచారం అందుకున్న మీర్‌పేట్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. బస్సులో మంటలు చెలరేగడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

html, body,
⬇ Full News JPG⬇ Short News JPG
← బెల్లంపల్లి: ఆరుగురు దొంగల అరెస్టుభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాములేరు వాగుపై కూలిన బ్రిడ్జి →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com