☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

Fire Accident | మేడ్చల్‌లో అగ్ని ప్రమాదం.. రెండు ఫర్నీచర్ దుకాణాలు దగ్ధం.. లక్షల్లో ఆస్తి నష్టం

Fire Accident | మేడ్చల్ పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో రెండు ఫర్నిచర్ దుకాణాలు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి.
Fire Accident | మేడ్చల్‌లో అగ్ని ప్రమాదం.. రెండు ఫర్నీచర్ దుకాణాలు దగ్ధం.. లక్షల్లో ఆస్తి నష్టం

Fire Accident | మేడ్చల్ : హైదరాబాద్ నగర శివారు మేడ్చల్ పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో రెండు ఫర్నిచర్ దుకాణాలు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి.

స్థానికులు, అగ్నిమాపక శాఖ అధికారుల కథనం ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో పారిశ్రామిక వాడలోని 44వ నంబర్ జాతీయ రహదారి పక్కన తాత్కాలిక షెడ్లలో ఏర్పాటు చేసుకున్న రెండు ఫర్నిచర్ దుకాణాల్లో మంటలు చెలరేగాయి. దుకాణాల్లో ఉన్న సోఫాలు, మ్యాట్రిసెస్ ల్లో ఉన్న ఫోమ్, రెగ్జిన్, కొబ్బరి నార కారణంగా కొద్ది సమయంలోనే మంటలు వ్యాపించి, రెండు దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సకాలంలో మంటలను ఆర్పడంతో పక్కనే ఉన్న మరో దుకాణానికి ప్రమాదం తప్పింది.

ఈ ప్రమాదంలో రెండు ఫర్నీచర్ దుకాణాల్లోని ఫర్నీచర్ పూర్తిగా దగ్ధం కావడంతో దాదాపు రూ.20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని అంటున్నారు. కాగా, స్థానిక పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Sircilla | సిరిసిల్ల అంబ భవాని ఆలయ ఉత్సవ కమిటీ ఎన్నికCanada | కెనడాలో బలవంతపు వసూళ్లు.. ఐదుగురు భారతీయుల అరెస్ట్‌ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com