☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

రాత్రి నూడుల్స్ తిని ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో పెను విషాదం చోటుచేసుకుంది. రబుపుర ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబంలోని ఐదుగురు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. శనివారం తెల్లవారుజామున ఇంట్లోని వారంతా అచేతనంగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతులను మహేష్ (37), ఆయన భార్య లలిత (35), వారి పిల్లలు లడ్డు (11), మిష్టి (7), సాక్షాత్ (3)గా […] The post రాత్రి నూడుల్స్ తిని ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి! appeared first on Adya News Telugu.
రాత్రి నూడుల్స్ తిని ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో పెను విషాదం చోటుచేసుకుంది. రబుపుర ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబంలోని ఐదుగురు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. శనివారం తెల్లవారుజామున ఇంట్లోని వారంతా అచేతనంగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

మృతులను మహేష్ (37), ఆయన భార్య లలిత (35), వారి పిల్లలు లడ్డు (11), మిష్టి (7), సాక్షాత్ (3)గా గుర్తించారు. శుక్రవారం రాత్రి వీరంతా కలిసి నూడుల్స్‌ తిని, ఆపై టీ తాగినట్లు మహేష్ తల్లి పోలీసులకు వివరించారు. ఆ తర్వాత నిద్రలోకి జారుకున్న వారు ఉదయానికి శవాలుగా మారారు. నూడుల్స్ కలుషితం కావడం వల్లే తీవ్ర అస్వస్థతకు గురై ఫుడ్ పాయిజనింగ్‌తో మరణించి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.

మరణాలకు గల అసలు కారణాన్ని గుర్తించేందుకు పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి పంపించారు. ఆహార భద్రతా విభాగం అధికారులు కూడా వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ఇంట్లో కుటుంబసభ్యులు తిన్న ఆహార పదార్థాలు, మిగిలిన నూడుల్స్ నమూనాలను సేకరించారు. వాటిని ఫోరెన్సిక్, ల్యాబ్ పరీక్షలకు పంపించారు. పూర్తి నివేదిక వచ్చాకే మరణానికి గల కారణాలు స్పష్టంగా తెలుస్తాయని అధికారులు పేర్కొన్నారు.

కొన్ని నెలల క్రితం మహారాష్ట్రలో బిర్యానీ, పుచ్చకాయ తిని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఇలాగే మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముంబయికి చెందిన అబ్దుల్లా డోకాడియా కుటుంబం వాంతులు, విరేచనాలతో ప్రాణాలు కోల్పోయింది. అది కూడా ఫుడ్ పాయిజనింగ్ వల్లే జరిగిందని వైద్యులు తేల్చారు. ఇప్పుడు గ్రేటర్ నోయిడాలో కూడా దాదాపు అలాంటి ఘటనే పునరావృతం కావడంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

The post రాత్రి నూడుల్స్ తిని ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి! appeared first on Adya News Telugu.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← కావ్యా మారన్‌ – అనిరుధ్ వివాహం.. సీఎం రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌కు ఆహ్వానం!చంద్రబాబు ఆదేశాలతోనే పోలీసుల కాల్పులు: సజ్జల →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com