అమరావతి : ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకు చెందిన సీపీఎం సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ ( Gafoor ) కుమారుడు పీవీ కిరణ్ ( PV Kiran ) అమెరికాలో గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాలిఫోర్నియాలోని ఒక కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న 41 ఏళ్ల పీవీ కిరణ్ ఈనెల 2న తన రూమ్‌లో గుండెపోటుతో మరణించారు.
కిరణ్ ఆఫీస్‌కు రాకపోవడంతో కంపెనీ ప్రతినిధులు స్నేహితులకు సమాచారం ఇచ్చారు. వారు కిరణ్ ఉంటున్న రూమ్ వద్దకు వెళ్లి చూడగా మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.






