☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

గణేశ్ నిమజ్జనాల్లో 13 మంది మృతి – డీజీపీ

Ganesh Nimajjanam 2026 : తెలంగాణవ్యాప్తంగా వినాయక చవితి శోభాయాత్రలు, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యాయని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) సీవీ ఆనంద్...
గణేశ్ నిమజ్జనాల్లో 13 మంది మృతి – డీజీపీ

Ganesh Nimajjanam 2026 : తెలంగాణవ్యాప్తంగా వినాయక చవితి శోభాయాత్రలు, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యాయని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) సీవీ ఆనంద్ వెల్లడించారు. జియో ట్యాగింగ్ మరియు ప్రత్యేక పోర్టల్ డేటా ప్రకారం ఈ ఏడాది బహిరంగ ప్రదేశాల్లో 1.24 లక్షల మండప విగ్రహాలు నమోదయ్యాయని, గతేడాది (1.15 లక్షలు) తో పోలిస్తే ఈ సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. అలాగే అపార్ట్‌మెంట్లు, గృహ ప్రాంగణాల్లో పూజలందుకున్న ప్రతిమలను పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3.50 లక్షల నుంచి 4 లక్షల వరకు విగ్రహాల నిమజ్జనం జరిగి ఉండవచ్చని ఆయన అంచనా వేశారు.

Read Also : ఓట్ల తొలగింపుపై మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు

నిమజ్జనాల్లో విషాదం: ఒక ఎస్సై సహా 13 మంది మృతి


రాష్ట్రవ్యాప్తంగా నిమజ్జనోత్సవాలు వైభవంగా సాగినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో చోటుచేసుకున్న ప్రమాదాలు తీవ్ర ఆవేదనకు గురిచేసాయని డీజీపీ పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఎస్సై వెంకన్నతో పాటు వివిధ ఘటనలలో మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు వద్ద జరిగిన ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, తీవ్రస్థాయి డీజే శబ్దాల ఒత్తిడి వల్ల గుండెపోటు వచ్చి కొందరు, ఊరేగింపులలో జరిగిన ప్రమాదాల వల్ల మరికొందరు మరణించారని వివరించారు. నిమజ్జన సమయాల్లో జరిగిన విభిన్న ఘటనల్లో మరొక 26 మంది గాయపడ్డారని, బాధితులకు తగిన వైద్య సదుపాయాలు అందిస్తున్నట్లు తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← వచ్చే నెల నుంచి కల్కి-2 షూటింగు స్టార్ట్‘పోలవరంతో తెలంగాణకు ముప్పు’- కేంద్రానికి తెలంగాణ సర్కార్ లేఖ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com