☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
నరసాపురం మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరేస్తాం! • Gold-Silver Prices Today : పండుగ వేళ బంగారం ధరల్లో కీలక మార్పులు.. తులం రేటు ఎంతంటే? • దసరా తర్వాతే పట్టాలెక్కే ఛాన్స్ • ఘోర ప్రమాదం: కాలువలో పడిన మినీ బస్సు.. 8 మంది మృతి • అబ్బా వీటిని అనవసరంగా లైట్‌ తీసుకున్నామే.. జుట్టురాలడానికి అసలు కారణం ఈ అలవాట్లేనా? • Vaibhav Sooryavanshi: గంభీర్ ఛాన్స్ ఎప్పుడు ఇస్తారు? వైభవ్ సూర్యవంశీ రెండు పదాలతో చెప్పిన సమాధానం ఇదే • Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! • ట్రంప్ కీలక నిర్ణయం.. రష్యాపై చమురు ఆంక్షల్లో మినహాయింపులు? •

Garividi Lakshmi Review: బుర్రకథల వైభవం.. ‘గరివిడి లక్ష్మి’ జీవితం తెరపై ఎలా ఉందంటే?

Garividi Lakshmi Review: బుర్రకథల వైభవం.. ‘గరివిడి లక్ష్మి’ జీవితం తెరపై ఎలా ఉందంటే?
Garividi Lakshmi Review: బుర్రకథల వైభవం.. ‘గరివిడి లక్ష్మి’ జీవితం తెరపై ఎలా ఉందంటే?
Garividi Lakshmi Review: బుర్రకథల వైభవం.. ‘గరివిడి లక్ష్మి’ జీవితం తెరపై ఎలా ఉందంటే?

ఏపీకి చెందిన ప్రముఖ జానపద గాయని గరివిడి విజయలక్ష్మి జీవితకథ ఆధారంగా దర్శకుడు గౌరి నాయుడు జమ్ము తెరకెక్కించిన చిత్రం ‘గరివిడి లక్ష్మి’ (Garividi Lakshmi). ఆనంది ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. దసరా కానుకగా 2026 అక్టోబర్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తన గళంతో వేలాది వేదికలపై ప్రేక్షకులను అలరించిన గరివిడి లక్ష్మి జీవిత ప్రయాణాన్ని దర్శకుడు వెండితెరపై ఎలా ఆవిష్కరించారు? పల్లె పాటలు, బుర్రకథల వైభవం, మన మూలాల గొప్పదనం సినిమాలో ఎంతవరకు ప్రతిబింబించాయి? జానపద కళాకారిణి జీవితంలోని భావోద్వేగాలను ‘గరివిడి లక్ష్మి’ ఎంత బలంగా చూపించగలిగింది? తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

‘గరివిడి లక్ష్మి’ కథేంటి?

కొన్ని జీవితాలు కాలగర్భంలో కలిసిపోతాయి.. మరికొన్ని జీవితాలు చరిత్రలో నిలిచిపోవాల్సినవైనా, తగిన గుర్తింపునకు నోచుకోవు. అలాంటి ఓ అసాధారణ జానపద కళాకారిణి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నమే ‘గరివిడి లక్ష్మి’.

విజయనగరం జిల్లా గరివిడికి చెందిన విజయలక్ష్మి (ఆనంది) చిన్నతనం నుంచే ఎన్నో కష్టాలను ఎదుర్కొంటుంది. తండ్రి ప్రేమకు దూరమై, బాల్య వివాహం తర్వాత వైవాహిక జీవితంలోనూ చేదు అనుభవాలను చవిచూస్తుంది. అయితే, ఆ బాధలే ఆమె ప్రయాణానికి ముగింపు కావు. పాటపై ఉన్న మక్కువ, అసాధారణమైన ప్రతిభ ఆమెను బుర్రకథ కళాకారిణిగా తీర్చిదిద్దుతాయి. తన గళంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న లక్ష్మి జీవితంలోకి సత్తిబాబు (రాగ్ మయూర్), రాంబాబు (నరేష్) రావడంతో కథ ఆసక్తికరమైన మలుపులు తిరుగుతుంది.

నమ్మినవారి వల్ల ఎదురైన మోసాలు, తన కళకు దక్కాల్సిన గుర్తింపు దూరమవడం ఆమె జీవితాన్ని ఎలాంటి సంక్షోభంలోకి నెట్టాయి? చివరకు ఆమె అజ్ఞాతంలోకి వెళ్లడానికి కారణమేంటి? లక్ష్మి జీవితాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్న దర్శకుడు రాజేష్ (అంకిత్ కొయ్య) ప్రయత్నం ఫలించిందా? వంటి ప్రశ్నలకు సమాధానాలు రావాలంటే సినిమా థియేటర్లలో చూడాల్సిందే..

విశ్లేషణ:

నిద్దుర లేపేది ‘కళ’.. పడిపోతే నడిపించేది.. ‘కళ’. ఒక్కడితో మొదలై వందల మందికి బతుకునిచ్చేది ‘కళ’. అలా చరిత్రలో ఎంతోమంది తమ ‘కళ’ కోసం ఎన్నో కష్టాలు పడ్డారు.. ఎంతో యుద్ధం చేసారు. ముఖ్యంగా చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి.. పడిపోతున్న సమయంలో పట్టు అందుకుని కళకే ప్రాణం పూసిన జీవితమే గరివిడి లక్ష్మి కథ. తానూ బుర్రకథలు చెప్పడమే కాదు, ఓ ఉద్యమంగా మార్చిన జానపద గాయని గరివిడి లక్ష్మి. ఆ కళామాతల్లి బిడ్డగా ఎదిగిన గరివిడి లక్ష్మి జీవితాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించారు డైరెక్టర్ గౌరి నాయుడు.

‘జానపదం’.. అంటే కేవలం పాట కాదు.. అది ఓ ప్రాంతపు జీవనశైలి, తరతరాల అనుభవాల సారం, మట్టిలో పుట్టిన మనుషుల గుండెల్లోంచి పుట్టుకొచ్చిన భావాల ప్రవాహం. అలాంటి అచ్చమైన జానపద కళకు, ఓ మహిళ జీవిత పోరాటాన్ని జోడించి తెరకెక్కించిన చిత్రమే ‘గరివిడి లక్ష్మి’. మరుగునపడిన ఓ కళాకారిణి జీవితాన్ని వెలుగులోకి తీసుకురావాలనే ఆలోచనతో దర్శకుడు గౌరి నాయుడు జమ్ము ఎంచుకున్న నేపథ్యం ఆసక్తికరంగా ఉంటుంది. కనుమరుగవుతున్న బుర్రకథ, జానపద కళల నేపథ్యంలో ఓ కళాకారిణి జీవితంలోని కన్నీళ్లు, కష్టాలు, సంఘర్షణలను చూపించే ప్రయత్నం ఆకట్టుకుంటుంది. కొన్ని సన్నివేశాలు ‘మహానటి’ని గుర్తుచేసినా, జానపద కళ చుట్టూ అల్లుకున్న కథ ఈ సినిమాకు ప్రత్యేకతను తీసుకొచ్చింది.

అయితే, గొప్ప కథాంశం తెరపైకి వచ్చినప్పుడు దానికి తగ్గ భావోద్వేగ బలం, కథనంలో లోతు కూడా తోడవ్వాలి. ఈ విషయంలో సినిమా కొన్ని చోట్ల మెప్పించినా, మరికొన్ని సందర్భాల్లో ఆశించిన స్థాయిని అందుకోలేకపోతుంది. ఫస్టాఫ్లో లక్ష్మి బాల్యం, కుటుంబ నేపథ్యానికి ఎక్కువ సమయం కేటాయించడంతో కథనం నెమ్మదిస్తుంది. మధ్యలో వినిపించే జానపద గేయాలు పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తాయి. అలరిస్తాయి కూడా. సెకండాఫ్లో ప్రేమ, మోసం, భావోద్వేగాలతో కథ ఆసక్తికరంగా మారుతుంది. ముఖ్యంగా లక్ష్మి ఎదుర్కొనే కష్టాలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి.

బుర్రకథలోని బలం.. భావోద్వేగాల్లోని లోతు

బుర్రకథకు గళమే ఆయుధం.. మాటే మాధ్యమం.. భావమే ప్రాణం. కథను చెప్పే విధానం, సందర్భానికి తగిన స్వరం, మాటల్లోని పదును, హావభావాల్లోని సహజత్వం కలిసినప్పుడే ఆ కళ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ నేపథ్యంలో లక్ష్మి జీవితంలో బుర్రకథ ప్రవేశించడం అనేది కేవలం వృత్తి మార్పుగా కాకుండా, తన బాధలకు ఓ భాష దొరకడం, తన ఉనికికి ఓ అర్థం లభించడం లాంటి భావనను కలిగిస్తుంది.

వ్యక్తిగత జీవితంలో ఎన్నో అవమానాలు, ఒంటరితనాన్ని ఎదుర్కొన్న మహిళకు కళ ఆత్మవిశ్వాసాన్ని అందించడం అనేది కథలోని బలమైన అంశం. అలాంటి సందర్భాల్లో జానపద పాటల వెనుక ఉన్న భావాన్ని, వాటిని ఆలపించే కళాకారిణి అనుభవాలను మరింత లోతుగా చూపించగలిగితే ప్రేక్షకులు ఆమెతో భావోద్వేగంగా మమేకమయ్యే అవకాశం ఉంటుంది. అయితే, ఈ అనుభూతిని తెరపై పూర్తిస్థాయిలో పండించడంలో సినిమా కాస్తా నిరాశపరిచింది. మొత్తంగా, జానపద కళాకారిణి జీవితాన్ని పరిచయం చేసే మంచి ప్రయత్నం ‘గరివిడి లక్ష్మి’.

ఆనంది నటన.. పాత్రలోని సంఘర్షణ..

విజయలక్ష్మి నుంచి గరివిడి లక్ష్మిగా మారే ప్రయాణంలో తాను ఎదుర్కొనే మానసిక సంఘర్షణే సినిమాకు బలాన్ని ఇచ్చేలా చేసింది. బాల్యంలోనే కుటుంబ పరిస్థితుల ప్రభావానికి లోనవడం, వైవాహిక జీవితంలో ఎదురుదెబ్బలు తగలడం, ఆ తర్వాత తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకోవాలనే తపన.. ఇవన్నీ నటనకు మంచి అవకాశాన్ని అందించేలా మారాయి. గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది జీవించేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆనంది తన నటనతో ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుంది.

టెక్నీకల్గా...

దర్శకుడు గౌరీ నాయుడు జమ్ము ఎంచుకున్న కథాంశం బలంగా ఉన్నప్పటికీ, స్క్రీన్‌ప్లేలో మరింత పట్టుండాల్సింది. జానపద నేపథ్యానికి తగ్గట్టుగా చరణ్ అర్జున్ అందించిన సంగీతం, పాటలు సినిమాకు ప్రత్యేకతను తీసుకొచ్చాయి. చరణ్ అర్జున్ లోని ఆ మట్టివాసనను గరివిడి లక్ష్మి సినిమా ద్వారా నిరూపించుకుంది సక్సెస్ అయ్యారు. ఎడిటింగ్‌లో ఇంకాస్త శ్రద్ధ తీసుకుని ఉంటే కథనం మరింత ఆసక్తికరంగా సాగేది.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← వారం తర్వాత వీకెండ్ పెరిగిన గోల్డ్ రేట్లు.. హైదరాబాదులో గ్రాము ఎంతంటే?దసరా ఉత్సవాలు : ఫారెస్ట్ కింగ్ సింహం.. అమ్మవారికి ఎలా వాహనం అయింది.. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com