☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
నరసాపురం మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరేస్తాం! • Gold-Silver Prices Today : పండుగ వేళ బంగారం ధరల్లో కీలక మార్పులు.. తులం రేటు ఎంతంటే? • దసరా తర్వాతే పట్టాలెక్కే ఛాన్స్ • ఘోర ప్రమాదం: కాలువలో పడిన మినీ బస్సు.. 8 మంది మృతి • అబ్బా వీటిని అనవసరంగా లైట్‌ తీసుకున్నామే.. జుట్టురాలడానికి అసలు కారణం ఈ అలవాట్లేనా? • Vaibhav Sooryavanshi: గంభీర్ ఛాన్స్ ఎప్పుడు ఇస్తారు? వైభవ్ సూర్యవంశీ రెండు పదాలతో చెప్పిన సమాధానం ఇదే • Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! • ట్రంప్ కీలక నిర్ణయం.. రష్యాపై చమురు ఆంక్షల్లో మినహాయింపులు? •

దసరా ఉత్సవాలు : ఫారెస్ట్ కింగ్ సింహం.. అమ్మవారికి ఎలా వాహనం అయింది.. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే..!

దసరా ఉత్సవాలు : ఫారెస్ట్ కింగ్ సింహం.. అమ్మవారికి ఎలా వాహనం అయింది.. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే..!
దసరా ఉత్సవాలు : ఫారెస్ట్ కింగ్ సింహం.. అమ్మవారికి ఎలా వాహనం అయింది.. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే..!
దసరా ఉత్సవాలు : ఫారెస్ట్ కింగ్ సింహం.. అమ్మవారికి ఎలా వాహనం అయింది.. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే..!

దసరానవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మహిషాసురుడిని సంహరించేటప్పుడు దుర్గాదేవి సింహంపై ఎందుకు వచ్చారు. సింహాన్ని అమ్మవారు వాహనంగా చేసుకోవడానికి గల కారణం ఏమిటి.. ధైర్యం... శక్తి.. ధర్మ విజయానికి సంబంధించిన విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . !

పురాణాల ప్రకారం దుర్గాదేవి అమ్మవారు మహిషాసురుడిని సంహరించి దేవతల ఇబ్బందులను తీర్చి.. చెడుపై మంచి విజయం సాధించినందుకు అమ్మవారిని వివిధ రూపాల్లో తొమ్మిది రోజుల పాటు ఎంతో శ్రద్దగా.. భక్తిగా పూజలు చేసే ఆచారం కొనసాగుతుంది.

దుర్గాదేవి అమ్మవారు సింహంపై స్వారీ చేస్తూ.. పది చేతుల్లో వివిధ ఆయుధాలను ధరించి, మహిషాసురుడిని సంహరించిన అమ్మవారు. అమ్మవారు సింహంపై ఎందుకు స్వారీ చేయడానికి అనేక కారణాలున్నాయని పండితులు చెబుతున్నారు.

ఫారెస్ట్​ కింగ్​ సింహం బలం.. ధైర్యానికి.. పరాక్రమానికి ఆధిపత్యంగా ఉంటుంది. దుర్గాదేవి వాహనమైన సింహం.. ఎంతటి శక్తివంతమైన శత్రువునైనా ఎదుర్కొనే ధైర్యానికి ప్రతిరూపంగా ఉంటుంది. అమ్మవారు సింహంపై స్వారీ చేయడం ద్వారా దుష్టశక్తులను ఎదుర్కొనే దైవిక శక్తిని సూచిస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. సింహం లేదా పులి ఏదైనా అమ్మవారి శక్తి, ధైర్యం, రక్షణ భావాలే వ్యక్తమవుతాయి.

శక్తివంతమైన జంతువు సైతం అమ్మవారి ఆధీనంలో ఉండటం.. మానవాళికి ఒక గొప్ప సందేశాన్ని తెలియజేస్తుంది. ఎందులోనైనా విజయం సాధించేందుకు .. కేవలం బలం ఉంటేనే సరిపోదని.. ఆ పని ధర్మాన్ని రక్షించేలా.. లోక కళ్యాణానికి ఉపయోగపడేలా ఉండాలి.

దుర్గాదేవి, మహిషాసురుడి కథకు దేవీ మాహాత్మ్యం అనే పవిత్ర గ్రంథంలో ప్రత్యేక స్థానం ఉంది. ఇది మార్కండేయ పురాణంలో భాగంగా ప్రసిద్ధి చెందింది. పురాణ కథనం ప్రకారం, మహిషాసురుడు అపారమైన శక్తిని సంపాదించి దేవతలను ఓడిస్తాడు. అతని దుష్టచర్యలతో ముల్లోకాల్లో అశాంతి ఏర్పడుతుంది. మహిషాసురుడి ఆగడాలను అరికట్టేందుకు దేవతలందరూ తమ దివ్యశక్తులను సమకూర్చగా, ఆ శక్తుల నుంచి దుర్గాదేవి ఆవిర్భవిస్తుంది. దేవతలు అమ్మవారికి వివిధ ఆయుధాలను సమర్పిస్తారు. అనంతరం సింహంపై స్వారీ చేస్తూ అమ్మవారు మహిషాసురుడితో భీకర యుద్ధానికి దిగుతారు.


దుర్గాదేవి వాహనం సింహం అలంకారానికి సంబంధించినది కాదు. మానవాళికి ఆధ్యాత్మిక సందేశాలను అందిస్తుంది.

ధైర్యానికి ప్రతీక: కష్టాలు, అన్యాయాలు ఎదురైనప్పుడు భయపడకుండా వాటిని ఎదుర్కోవాలనే సందేశాన్ని సింహంలా పోరాడాలని తెలిజెప్పేందుకే అందిస్తుంది.

శక్తికి ప్రతిరూపం: అమ్మవారి ఆధీనంలో సింహం ఉండటం ద్వారా శక్తి సరైన మార్గంలో ఉపయోగపడాలని సూచిస్తుంది. అంటే మానవులకు ఉండే శక్తిని సరైన మార్గంలో ఉండాలని చెప్పేందుకే శక్తికి ప్రతిరూపంగా అమ్మవారిని పూజలు చేస్తాము.

ధర్మ విజయానికి సంకేతం: మహిషాసురుడు అధర్మానికి, అహంకారానికి ప్రతీకగా నిలిస్తే.. దుర్గాదేవి విజయం ధర్మం, న్యాయం చివరకు నిలబడతాయనే విశ్వాసాన్ని తెలియజేస్తుంది.
ఆదిశక్తి మహిమ: సింహంపై అమ్మవారి ఆధిపత్యం.. ప్రకృతిలోని అపారమైన శక్తులను సైతం నియంత్రించగల దైవిక శక్తికి ప్రతీకగా భావిస్తారు.

యుద్ధంలో మహిషాసురుడు వివిధ రూపాలను ధరించి పోరాడినప్పటికీ, చివరకు దుర్గాదేవి అతడిని సంహరిస్తుంది. తద్వారా ధర్మాన్ని పునరుద్ధరించి, లోకాలకు శాంతిని చేకూరుస్తుంది. దుర్గాపూజ విగ్రహాల్లో సింహం మహిషాసురుడిపై దాడి చేస్తున్నట్లుగా చూపించడం ఈ విజయగాథకు ప్రతీకని పండితులు చెబుతున్నారు.

ఎంతటి కష్టం వచ్చినా చాలా ప్రశాంతంగా.. మనశ్శాంతిగా ఉండి సమస్యలను ఎదుర్కోవాలి. అందుకే దుర్గాదేవి అమ్మవారు వరాలు పొందిన మహిషాసురుడితో యుద్దం చేసేటప్పుడు సింహంపై చాలా ప్రశాంతంగా.. నిర్మలంగా ఉన్నారని మార్కండేయ పురాణం ద్వారా తెలుస్తుంది. జీవితంలో వచ్చే కష్టాలను.. ఇబ్బందులను కోపం ... భయంతో కాకుండా ఆత్మవిశ్వాసం, వివేకం, ధర్మ సంకల్పంతో దుష్టశక్తులను ఎదుర్కోవాలని పురాణాల ద్వారా తెలుస్తుంది.

అందుకే దుర్గాదేవి సింహం పై అధిష్ఠించి మానవులకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందించే ఆధ్యాత్మిక ప్రతీక అని పండితులు చెబుతున్నారు. అందుకే దసరా ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకునేటప్పుడు దుర్గాదేవి అమ్మవారి రూపం అంతరార్థాన్ని తెలుసుకోవడం వలన శక్తి, ధర్మం, సత్యం పట్ల మన విశ్వాసాన్ని మరింత బలపడుతుందని ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా తెలుస్తుంది.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Garividi Lakshmi Review: బుర్రకథల వైభవం.. ‘గరివిడి లక్ష్మి’ జీవితం తెరపై ఎలా ఉందంటే?కూకట్ పల్లి జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దగ్గర తగలబడ్డ బైక్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com