☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ఆ ఒక్క నిర్ణయం నన్ను రాత్రంతా నిద్రపోనివ్వలేదు: సంజు డ్రాప్‌పై గంభీర్ సంచలనం

ఆ ఒక్క నిర్ణయం నన్ను రాత్రంతా నిద్రపోనివ్వలేదు: సంజు డ్రాప్‌పై గంభీర్ సంచలనం
ఆ ఒక్క నిర్ణయం నన్ను రాత్రంతా నిద్రపోనివ్వలేదు: సంజు డ్రాప్‌పై గంభీర్ సంచలనం
ఆ ఒక్క నిర్ణయం నన్ను రాత్రంతా నిద్రపోనివ్వలేదు: సంజు డ్రాప్‌పై గంభీర్ సంచలనం

Gautam Gambhir: స్వదేశంలో వెస్టిండీస్‌తో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌కు ముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. గత జులైలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో స్టార్ వికెట్ కీపర్ సంజు శాంసన్‌ను పక్కన పెట్టి, 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వడం తన కోచింగ్ కెరీర్‌లోనే అత్యంత కష్టమైన నిర్ణయమని పేర్కొన్నాడు. ఆ నిర్ణయం తీసుకున్న రోజు రాత్రంతా తాను నిద్రపోలేదని గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ప్లేయర్ ఆఫ్ ది టోర్నీని పక్కన పెట్టాం:

ఇంగ్లాండ్ పర్యటన నాటి సంఘటన గురించి జియోస్టార్‌తో మాట్లాడిన గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. నా రెండేళ్ల కోచింగ్ ప్రయాణంలో నిద్రలేని ఏకైక రాత్రి అదొక్కటే.. టీ20 ప్రపంచ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచిన ఆటగాడిని, మూడు మ్యాచ్‌ల వైఫల్యం కారణంగా పక్కన పెట్టడం ఏ కోచ్‌కైనా చాలా కష్టమైన విషయం.. ఆ సమయంలో టీనేజర్ వైభవ్ సూర్యవంశీ అత్యద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. భారత్‌కు కోచింగ్ ఇస్తున్నప్పుడు ప్రతీ సిరీస్ గెలవడం ముఖ్యం.. ఆ క్షణంలో ఓపెనింగ్‌లో వేగంగా పరుగులు సాధించే ఆటగాడు అవసరమైయ్యాడని పేర్కొన్నాడు. జట్టు నుంచి సంజు శాంసన్‌ని తప్పిస్తున్నట్లు అతడితోనే మాట్లాడాను.. పరిస్థితిని అతనికి వివరించగా, సంజు చాలా స్పోర్టివ్‌గా తీసుకున్నాడని గంభీర్ తెలిపాడు.

సోషల్ మీడియా జట్టు సెలక్ట్ చేయదు:

యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవడంపై వస్తున్న ఒత్తిళ్లపై కోచ్ గంభీర్ ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. సోషల్ మీడియా లేదా బయట జరిగే గోల ప్లేయింగ్ ఎలెవన్‌ను నిర్ణయించవు.. డ్రెస్సింగ్ రూమ్‌లో కెప్టెన్, కోచ్ ఎవరినైతే మ్యాచ్ విన్నర్‌గా భావిస్తారో వారినే మైదానంలోకి దింపుతారని చెప్పాడు. వైభవ్ సూర్యవంశీ ఎంత ఫామ్‌లో ఉన్నప్పటికీ, జట్టులో సుదీర్ఘకాలం ప్రభావం చూపిన సంజు శాంసన్, అభిషేక్ శర్మ వంటి ప్లేయర్లు ఉన్నప్పుడు తన అవకాశం కోసం వేచి చూడక తప్పదని సూచించాడు. జనాదరణ పొందే నిర్ణయాలు (Popular Decisions) తీసుకోవడం సులభమే, కానీ సరైన నిర్ణయాలు (Right Decisions) తీసుకోవడమే చాలా కష్టం అన్నాడు.

ALSO READ : 59 రన్స్ చేస్తే కోహ్లీ 15K.. 105 చేస్తే రోహిత్ 12K

శ్రేయస్ అయ్యర్ స్వార్థం లేని కెప్టెన్:

ఐపీఎల్ 2024లో కేకేఆర్‌లో నా ప్రయాణం మొదలైనప్పటి నుంచి శ్రేయస్‌ను చూస్తున్నాను.. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ లేదా జట్టు ప్రయోజనాల కోసం తన 4వ బ్యాటింగ్ స్థానాన్ని కూడా త్యాగం చేయడానికి అయ్యర్ ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపాడు. ఒక కెప్టెన్ ఎంత ఫిట్‌గా ఉన్నా, నంబర్ 1 బ్యాటర్ అయినా స్వార్థం లేకపోతే దేనికీ పనికిరాడు.. శ్రేయస్‌లో ఉన్న ఆ నిస్వార్థ గుణమే అతడిని ఒక గొప్ప నాయకుడిగా నిలబెడుతుందన్నాడు. ఒకటి రెండు ఓటములు ఎదురైనంత మాత్రాన కంగారుపడాల్సిన అవసరం లేదని, మూడేళ్ల వ్యవధిలోనే టీమిండియా టీ20 ప్రపంచ కప్ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించిందని గంభీర్ పేర్కొన్నాడు.

⬇ Full News JPG⬇ Short News JPG
← మీ ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిందా? ఏదీ డిలీట్ చేయకుండా స్టోరేజ్ పెంచుకునే సీక్రెట్ ట్రిక్స్ ఇవే !Car Rams Parked Truck | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. మంత్రి కుమార్తె సహా నలుగురు మృతి →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com