☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Car Rams Parked Truck | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. మంత్రి కుమార్తె సహా నలుగురు మృతి

Car Rams Parked Truck | రహదారి పక్కన ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆ కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. మంత్రి కుమార్తెతో సహా నలుగురు వ్యక్తులు ఈ ప్రమాదంలో మరణించారు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Car Rams Parked Truck | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. మంత్రి కుమార్తె సహా నలుగురు మృతి

రాంచీ: రహదారి పక్కన ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆ కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. మంత్రి కుమార్తెతో సహా నలుగురు వ్యక్తులు ఈ ప్రమాదంలో మరణించారు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. (Car Rams Parked Truck ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ నగరంలో ఈ సంఘటన జరిగింది. గురువారం తెల్లవారుజామున మెరైన్ డ్రైవ్ రోడ్డు పక్కన బ్రేక్‌డౌన్‌ వల్ల నిలిచి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదం ధాటికి ఆ కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.

కాగా, ఝార్ఖండ్‌ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దీపికా పాండే సింగ్ కుమార్తె త్రిషా సింగ్‌తో సహా నలుగురు వ్యక్తులు ఈ ప్రమాదంలో మరణించారు. మిగతా ముగ్గురు మృతులను సార్థక్ అగర్వాల్, నమన్ గుప్తా, వంశిక ఖండేల్‌వాల్‌గా పోలీసులు గుర్తించారు. ఈ నలుగురు 12వ తరగతి విద్యార్థులని తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి వెల్లడించారు.

మరోవైపు ఝార్ఖండ్‌ మంత్రి దీపికా పాండే సింగ్ కుమార్తె త్రిషా సింగ్‌ రోడ్డు ప్రమాదంలో మరణించడం పట్ల ఆ రాష్ట్ర గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఇతర రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ఆ ఒక్క నిర్ణయం నన్ను రాత్రంతా నిద్రపోనివ్వలేదు: సంజు డ్రాప్‌పై గంభీర్ సంచలనంAsian Games 2026: మిక్స్‌డ్ టీమ్ స్కీట్‌లో కాంస్యం గెలిచిన అనంత్ జీత్‌, ప‌రినాజ్‌ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com