☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

‘తురకకాశ కార్మికులకు జనరేటర్లు అందించాలి’

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో తురక కాశ కార్మికుల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన జనరేటర్లు అర్హులైన కార్మికులకు అందేలా చూడాలని తురకకాశ సంక్షేమ సంఘం నాయకులు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు.
‘తురకకాశ కార్మికులకు జనరేటర్లు అందించాలి’

– ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు సంఘ నాయకుల వినతి

బూర్గంపహాడ్, సెప్టెంబర్ 24 : భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో తురక కాశ కార్మికుల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన జనరేటర్లు అర్హులైన కార్మికులకు అందేలా చూడాలని తురకకాశ సంక్షేమ సంఘం నాయకులు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం మంజూరు చేసిన జనరేటర్ల కేటాయింపులో అర్హులైన కొందరు కార్మికులకు అన్యాయం జరుగుతుందని ఆయన దృష్టికి తీసుకువ‌చ్చారు. జనరేటర్ల కేటాయింపు ప్రక్రియపై తమకు పలు అభ్యంతరాలు ఉన్నాయని, అర్హులైన అసలైన తురకకాశ కార్మికులకు ఈ పథకం ప్రయోజనం అందేలా చూడాలని కోరారు. జనరేటర్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపి నిర్దేశించిన నిబంధనల ప్రకారం అర్హులకు జనరేటర్లు అందేలా అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ బికారి, బూర్గంపహాడ్ మండల అధ్యక్షుడు షేక్ అజీజ్, అశ్వాపురం మండల అధ్యక్షుడు షేక్ ఖలీల్, జనరల్ సెక్రటరీ షేక్ మదర్వలి, అంజనాపురం గ్రామ అధ్యక్షుడు షేక్ ఖాసీం, రాజమ్మద్ పాల్గొన్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Shocking incident | రేవంత్‌ రెడ్డి సొంత మండలంలో దారుణం..మహిళా సర్పంచ్‌ను బూతులు తిట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యేLizard Found in Food : స్కూల్‌లో షాకింగ్ ఘటన.. పిల్లలకు పెట్టిన టిఫిన్‌లో బల్లి.. ఆస్పత్రిలో విద్యార్థులు.. ఆందోళనలో తల్లిదండ్రులు.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com