☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Bihar: రోడ్డుపై అమ్మాయిని వేధించిన ఆక‌తాయిలు.. బీహార్‌లో మ‌రో ఘ‌ట‌న‌

Bihar: బీహార్‌లోని స‌మ‌స్తిపుర్‌లో ఓ అమ్మాయిని లైంగికంగా వేధించారు. ఈ ఘ‌ట‌న‌కు చెందిన వీడియో వైర‌ల్ అయ్యింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు న‌లుగుర్ని అరెస్టు చేశారు.
Bihar: రోడ్డుపై అమ్మాయిని వేధించిన ఆక‌తాయిలు.. బీహార్‌లో మ‌రో ఘ‌ట‌న‌

న్యూఢిల్లీ: బీహార్‌(Bihar)లో ఓ అమ్మాయిని లైంగికంగా వేధించిన ఘ‌ట‌న మ‌రొక‌టి చోటుచేసుకున్న‌ది. ఇటీవ‌ల జాముయిలో జ‌రిగిన ఘ‌ట‌న త‌ర్వాత తాజాగా స‌మ‌స్తిపుర్‌లో జ‌రిగిన సంఘ‌ట‌న‌కు చెందిన వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతోంది. ఓ అబ్బాయితో క‌లిసి బైక్‌పై వెళ్తున్న అమ్మాయిని కొంద‌రు యువ‌కులు అడ్డుకున్నారు. రోడ్డుపై ఆ అమ్మాయిని వేధించ‌డం మొద‌లుపెట్టారు. ఆమె ప్రైవేటు శ‌రీర భాగాల‌పై చేతులు వేసి వేధించారు. మాట‌ల‌తోనూ ఆ అమ్మాయిని వెంటాడారు. స‌మ‌స్తిపుర్‌లోని జ‌గ‌త్‌సింగ్పుర్ గ్రామంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

వీడియోను చూసిన వెంట‌నే పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. రోడ్డుపై ఫోటోలు దిగేందుకు అమ్మాయి, అబ్బాయిలు బైక్‌ను ఆపార‌ని, ఆ స‌మ‌యంలో స్థానిక యువ‌కులు ఆమెపై అటాక్ చేసిన‌ట్లు తెలిసింది. ఈఘ‌ట‌న‌ను సిరీయ‌స్‌గా తీసుకున్న పోలీసులు వారిని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఆ వీడియోలో ఉన్న వారిని గుర్తించిన త‌ర్వాత వారిని అరెస్టు చేయ‌నున్న‌ట్లు పోలీసు ఆఫీస‌ర్ అర‌వింద్ ప్ర‌తాప్ సింగ్ తెలిపారు. కొన్ని రోజుల క్రిత‌మే జాముయిలో ఇద్ద‌రు ప‌దో త‌ర‌గతి విద్యార్థినుల‌ను వేధించిన విష‌యం తెలిసిందే.

స‌మ‌స్తిపుర్ ఘ‌ట‌న‌కు చెందిన న‌లుగుర్ని అరెస్టు చేసిన‌ట్లు ఎస్పీ తెలిపారు. వారిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన‌ట్లు వెల్ల‌డించారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Fire Accident | ర‌న్నింగ్ బ‌స్సులో ఒక్క‌సారిగా చెల‌రేగిన మంట‌లు.. క్ష‌ణాల్లో ద‌గ్ధం.. VideoDanam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టు షాక్.. పిటిషన్ డిస్మిస్ చేసిన ధర్మాసనం.. ఖైరతాబాద్‌లో బై ఎలక్షన్ ఫిక్స్! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com