☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై సమన్లు.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి! • Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్‌ సంచలన వ్యాఖ్యలు! • ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య.. ‘వృషకర్మ’ కొత్త పోస్టర్ విడుదల! • మీ నంబర్ Truecallerలో కనిపిస్తోందా? ఈ ట్రిక్స్‌ ద్వారా డైరెక్టరీ నుండి తొలగించండి..! • Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..! • భారత్‌తో క్రికెట్ ఆడినా మాకు పైసా రావడం లేదు.. వెస్టిండీస్ బోర్డు ఆవేదన • Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ మూవీలో బాలయ్య రిజెక్ట్ చేసిన రోల్ ఎవరు చేశారో తెలుసా? • YS Jagan : ఎంపీ మిథున్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా! చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు.. •

Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభ‌వానీ గుడిలో స‌ర‌స్వ‌తీ దేవి అలంకార‌ములో అమ్మ‌వారు

Punjagutta Temple: ఇవాళ మూలాన‌క్ష‌త్రం. పంజాగుట్ట‌లోని దుర్గాభ‌వానీ అమ్మ‌వారిని స‌ర‌స్వ‌తీదేవి అలంకారంలో తీర్చిదిద్దారు. ఆల‌యంలో దేవీన‌వ‌రాత్రులను వైభ‌వంగా నిర్వ‌హిస్తున్నారు. వంద‌లాది సంఖ్య‌లో భ‌క్తులు అమ్మ‌వారిని ద‌ర్శించుకుంటున్నారు.
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభ‌వానీ గుడిలో స‌ర‌స్వ‌తీ దేవి అలంకార‌ములో అమ్మ‌వారు

హైద‌రాబాద్‌: దేశ‌వ్యాప్తంగా దేవీ న‌వ‌రాత్రుల ప‌ర్వ‌దినాలు వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. మూలాన‌క్ష‌త్రం నేప‌థ్యంలో ప‌లు ఆల‌యాల్లో ఇవాళ అమ్మ‌వారు శ్రీ స‌ర‌స్వ‌తీ దేవి అలంకార‌ములో ద‌ర్శ‌నం ఇస్తున్నారు. హైద‌రాబాద్‌లోని పంజాగుట్ట‌లో ఉన్న శ్రీ దుర్గాభ‌వానీ ఆల‌యంలో .. అమ్మ‌వారు ఇవాళ స‌ర‌స్వ‌తీ దేవిగా ద‌ర్శ‌నం ఇస్తున్నారు. ఆర‌వ రోజు అత్యంత సుంద‌రంగా అమ్మ‌వారిని అలంక‌రించారు. ధ‌వ‌ళ వ‌స్త్రాల్లో అమ్మ‌వారు .. చ‌దువుల త‌ల్లిగా భ‌క్తుల‌ను ఆశీర్వ‌దిస్తున్నారు. చిన్న పిల్ల‌ల‌కు ఇవాళ ఆల‌యంలో స‌ర‌స్వ‌తీ పూజ నిర్వ‌హిస్తున్నారు. ఈ రోజు మ‌ధ్యాహ్నం ఆల‌యంలో అన్న‌విత‌ర‌ణ కార్య‌క్ర‌మం కూడా ఉన్న‌ది. ప్ర‌ధాన అర్చ‌కులు దుర్గాప్ర‌సాద్‌, న‌వీన్ ఆధ్వ‌ర్యంలో పూజ‌లు జ‌రుగుతున్నాయి. భ‌క్తుల కోసం ఆల‌య క‌మిటీ అన్ని ఏర్పాట్లు చేసింది.

శరన్నవరాత్రుల్లో శ్రీ సరస్వతీ దేవి అలంకారానికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది. దేవీ నవరాత్రుల్లో ఆరో రోజున లేదా మూలా నక్షత్రం ఉన్న రోజున అమ్మవారిని చదువుల తల్లి సరస్వతీ దేవిగా అలంకరించి పూజిస్తారు. సరస్వతి దేవి జ్ఞానం, విద్య, సాహిత్యం, కళలు, సంగీతం, వివేకానికి అధిదేవత. అమ్మవారిని ఈ రూపంలో దర్శించుకుని ఆరాధిస్తే బుద్ధి వికాసం, వాగ్వైభవము, విద్యా లాభం కలుగుతాయి.

Pooja

ఇక విజ‌య‌వాడ‌లో ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన క‌న‌క‌దుర్గా దేవి కూడా ఇవాళ స‌ర‌స్వ‌తీ దేవి అలంకారంలో ద‌ర్శ‌నం ఇస్తున్నారు. అర్ధరాత్రి 12.49గం.కు దుర్గమ్మ దర్శనం ప్రారంభమైంది. ఇవాళ‌ అన్ని రకాల వీవీఐపీ, సిఫార్సు దర్శనాలు రద్దు చేశారు. ఉచితంగానే అన్ని క్యూలైన్ల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్‌ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్‌ సవాల్‌!Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై సమన్లు.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com