☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై సమన్లు.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి! • Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్‌ సంచలన వ్యాఖ్యలు! • ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య.. ‘వృషకర్మ’ కొత్త పోస్టర్ విడుదల! • మీ నంబర్ Truecallerలో కనిపిస్తోందా? ఈ ట్రిక్స్‌ ద్వారా డైరెక్టరీ నుండి తొలగించండి..! • Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..! • భారత్‌తో క్రికెట్ ఆడినా మాకు పైసా రావడం లేదు.. వెస్టిండీస్ బోర్డు ఆవేదన • Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ మూవీలో బాలయ్య రిజెక్ట్ చేసిన రోల్ ఎవరు చేశారో తెలుసా? • YS Jagan : ఎంపీ మిథున్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా! చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు.. •

Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్‌ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్‌ సవాల్‌!

Manne Krishank | మెడికవర్‌ ఆసుపత్రి అంశంలో సీఎం రేవంత్ రెడ్డి దాటవేత ధోరణిపై బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. తమ కుటుంబానికి మెడికవర్‌లో వాటాలు ఉన్నాయనడానికి ఆధారాలు ఉన్నాయా? అంటూ చేసిన వ్యాఖ్యలపై కౌంటరిచ్చారు
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్‌ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్‌ సవాల్‌!

Manne Krishank | మెడికవర్‌ ఆసుపత్రి అంశంలో సీఎం రేవంత్ రెడ్డి దాటవేత ధోరణిపై బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. తమ కుటుంబానికి మెడికవర్‌లో వాటాలు ఉన్నాయనడానికి ఆధారాలు ఉన్నాయా? అంటూ చేసిన వ్యాఖ్యలపై కౌంటరిచ్చారు. ఒకటి కాదు.. మూడు ఆధారాలు చూపిస్తా.. చర్చకు సిద్ధమేనా అని రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు. ఈ మేరకు సోషల్‌మీడియాలో ఒక వీడియోను రిలీజ్ చేశారు.

రేవంత్‌రెడ్డికి సన్నిహితులుగా పేర్కొంటున్న అన్నం శరత్‌రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, దుంప శిరీషారెడ్డికి మెడికవర్‌ ఆసుపత్రితో పాటు మ్యాక్స్‌ బీఎన్‌ ఫార్మా, మైండ్‌ వాల్ట్‌ సంస్థల్లో షేర్లు ఉన్నాయంటూ క్రిశాంక్‌ వివరాలను ప్రస్తావించారు. అన్నం శరత్‌రెడ్డికి మెడికవర్‌ ఆసుపత్రిలో 5,08,800 షేర్లు, మ్యాక్స్‌ బీఎన్‌ ఫార్మాలో 1,08,000 షేర్లు ఉన్నాయని పేర్కొన్నారు. బ్రహ్మానందరెడ్డికి మెడికవర్‌లో 28,78,192 షేర్లు, మైండ్‌ వాల్ట్‌లో 65,834 షేర్లు ఉన్నాయని తెలిపారు. అలాగే దుంప శిరీషారెడ్డికి మెడికవర్‌లో 46,46,596 షేర్లు, మ్యాక్స్‌ బీఎన్‌ ఫార్మాలో 37 లక్షల షేర్లు, మైండ్‌ వాల్ట్‌లో 1,97,500 షేర్లు ఉన్నాయని ఆరోపించారు.

ఈ ముగ్గురికి ఆయా సంస్థల్లో వాటాలు ఉన్నాయని చెబుతూ, వాటి వివరాలపై ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వాలని క్రిశాంక్‌ కోరారు. వీరిలో కొందరికి రేవంత్‌రెడ్డి కుటుంబంతో బంధుత్వ సంబంధాలు ఉన్నాయని కూడా ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. మెడికవర్‌ ఆసుపత్రిని అమ్మేసి రూ.13,200 కోట్ల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారంటూ ఆరోపించారు. కష్టకాలంలో ఉన్న రైతులకు ఆ మొత్తాన్ని పంచాలని వ్యాఖ్యానించారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Bhatti vs Revanth | భట్టి వర్సెస్‌ రేవంత్‌.. ముదురుతున్న వివాదం.. విద్యుత్‌ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలంPunjagutta Temple: పంజాగుట్ట దుర్గాభ‌వానీ గుడిలో స‌ర‌స్వ‌తీ దేవి అలంకార‌ములో అమ్మ‌వారు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com