☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై సమన్లు.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి! • Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్‌ సంచలన వ్యాఖ్యలు! • ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య.. ‘వృషకర్మ’ కొత్త పోస్టర్ విడుదల! • మీ నంబర్ Truecallerలో కనిపిస్తోందా? ఈ ట్రిక్స్‌ ద్వారా డైరెక్టరీ నుండి తొలగించండి..! • Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..! • భారత్‌తో క్రికెట్ ఆడినా మాకు పైసా రావడం లేదు.. వెస్టిండీస్ బోర్డు ఆవేదన • Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ మూవీలో బాలయ్య రిజెక్ట్ చేసిన రోల్ ఎవరు చేశారో తెలుసా? • YS Jagan : ఎంపీ మిథున్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా! చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు.. •

Bhatti vs Revanth | భట్టి వర్సెస్‌ రేవంత్‌.. ముదురుతున్న వివాదం.. విద్యుత్‌ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం

Bhatti vs Revanth | సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య వివాదం మరింత ముదురుతోంది. విద్యుత్‌ శాఖ అధికారుల పనితీరును భట్టి విక్రమార్క ప్రశంసించిన మరుసటి రోజే.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యుత్‌ కోతలపై అధికారుల తీరును తప్పుబట్టడం చర్చకు దారితీసింది.
Bhatti vs Revanth | భట్టి వర్సెస్‌ రేవంత్‌.. ముదురుతున్న వివాదం.. విద్యుత్‌ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం

Bhatti vs Revanth | సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య వివాదం మరింత ముదురుతోంది. విద్యుత్‌ శాఖ అధికారుల పనితీరును భట్టి విక్రమార్క ప్రశంసించిన మరుసటి రోజే.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యుత్‌ కోతలపై అధికారుల తీరును తప్పుబట్టడం చర్చకు దారితీసింది. ఈ పరిణామాలతో ప్రభుత్వంలోని కీలక నేతల మధ్య విభేదాలు ఉన్నాయా? అనే చర్చ అధికార వర్గాల్లో మొదలైనట్లు సమాచారం.

విద్యుత్‌ సరఫరాను నిరంతరాయంగా అందించేందుకు అధికారులు, సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని భట్టి విక్రమార్క ప్రశంసించారు. అయితే, విద్యుత్‌ కోతల అంశంపై మరుసటి రోజే రేవంత్‌రెడ్డి అధికారుల పనితీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం విద్యుత్‌ శాఖ వర్గాల్లో చర్చకు కారణమైంది. విద్యుత్‌ సరఫరాలో ఎదురవుతున్న సమస్యలకు అధికారులనే బాధ్యులను చేయడం సరికాదని భట్టి విక్రమార్క భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన శాఖ వ్యవహారాల్లో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటున్నారనే అసహనం కూడా ఆయనకు ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ సాగుతున్నట్లు సమాచారం.

యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ చీఫ్‌ ఇంజినీర్‌పై సస్పెన్షన్‌ చర్యలు తీసుకోవడం, విద్యుత్‌ అధికారుల పనితీరును పరిశీలించేందుకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయడం కూడా చర్చకు దారితీసింది. విద్యుత్‌ కోతలకు అధికారులే కారణమన్నట్లుగా వ్యవహరించడం, వరుస చర్యలు తీసుకోవడంపై కొందరు అధికారులు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలో ఉన్న సమస్యలను సమగ్రంగా పరిశీలించకుండా అధికారులపై చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.

యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను జెన్‌కో ఎండీ సందర్శించిన నేపథ్యంలో విద్యుత్‌ శాఖ అధికారుల మధ్య ఈ అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన కమిటీకి సహకరించకూడదనే అభిప్రాయం కొందరు సిబ్బందిలో వ్యక్తమైనట్లు ప్రచారం జరుగుతోంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్‌పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్‌ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్‌ సవాల్‌! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com