☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
నరసాపురం మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరేస్తాం! • Gold-Silver Prices Today : పండుగ వేళ బంగారం ధరల్లో కీలక మార్పులు.. తులం రేటు ఎంతంటే? • దసరా తర్వాతే పట్టాలెక్కే ఛాన్స్ • ఘోర ప్రమాదం: కాలువలో పడిన మినీ బస్సు.. 8 మంది మృతి • అబ్బా వీటిని అనవసరంగా లైట్‌ తీసుకున్నామే.. జుట్టురాలడానికి అసలు కారణం ఈ అలవాట్లేనా? • Vaibhav Sooryavanshi: గంభీర్ ఛాన్స్ ఎప్పుడు ఇస్తారు? వైభవ్ సూర్యవంశీ రెండు పదాలతో చెప్పిన సమాధానం ఇదే • Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! • ట్రంప్ కీలక నిర్ణయం.. రష్యాపై చమురు ఆంక్షల్లో మినహాయింపులు? •

Gold Rates: పండక్కి ముందే పేలిన బంగారం బుడుగ.. పరుగులు పెట్టిన ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవిగో..

దసరా, దీపావళి పండుగలకు ముందే బ్యాడ్ న్యూస్. ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. పండక్కి ముందే బుడుగ పేలింది. పండుగల క్రమంలో బంగారం కొంటే శుభం జరుగుతుందనే సెంటిమెంట్ చాలామందిలో ఉంటుంది. ఈ కారణంతో బంగారం కొనుగోళ్లు పెరుగుతుండటంతో డిమాండ్ వల్ల ధరలు కొండెక్కాయి.
Gold Rates: పండక్కి ముందే పేలిన బంగారం బుడుగ.. పరుగులు పెట్టిన ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవిగో..
Gold 1

పండక్కి ముందు బంగారం ధరలపై ఒక్కసారి సీన్ రివర్స్ అయింది. దసరా పండుగ ఇంకా రెండు రోజులు మాత్రమే ఉండనగా.. ఊహించని ట్విస్ట్ ఇచ్చాయి. ధరలు ఒక్కసారిగా పెరిగి నిరాశపర్చాయి. ఈ వారం ప్రారంభం నుంచి ప్రతీరోజు ధరలు పడిపోతుండగా.. ఇవాళ తగ్గుదలకు బ్రేక్ పడింది. శనివారం గంటల వ్యవధిలోనే ధరలు పుంజుకున్నాయి. అక్టోబర్ 17న లేటెస్ట్ ధరలు చూద్దాం

Gold 2

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,47,660 వద్ద కొనసాగుతోంది. ఇవాళ రూ.220 మేర పెరిగాయి. అటు 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,35,350గా పలుకుతుండగా.. నేడు రూ.200 పెరుగుదలను నమోదు చేశాయి. విజయవాడ,విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Gold 3

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,810 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,35,500కు లభిస్తోంది. చెన్నైలో 24 క్యారెట్లు ధర రూ.1,47,660గా, 22 క్యారెట్ల రేటు రూ.1,35,350గా పలుకుతోంది.

Gold 4

బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,660కు లభిస్తోండగా.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,35,350 వద్ద కొనసాగుతోంది. అటు ముంబైలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ఇక వెండి ధరలు మాత్రమే స్థిరంగా కొనసాగుతున్నాయి.

Gold 5

బెంగళూరులో కిలో వెండి ధర రూ.2.30 లక్షలుగా ఉండగా.. హైదరాబాద్‌లో రూ.2.40 లక్షలుగా ఉంది. అటు ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2.30 లక్షల వద్ద కొనసాగుతోంది. దసరా, దీపావళి వరుస పండుగల క్రమంలో బంగారం, వెండికి డిమాండ్ పెరుగుతోంది. ఎక్కువమంది కొనుగోలు చేసేందుకు ముందుకొస్తున్నారు. దీని వల్ల ధరలు పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది మృతికి కారణమైన రష్యా సైనికుడుRajinikanth: జిమ్ లేదు.. డైట్ లేదు.. 75 ఏళ్ల వయసులో అదరగొట్టిన రజినీ.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదనట.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com