☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

ఛీ.. ఛీ.. అమ్మతనానికే మాయని మచ్చ.. సహజీవనానికి అడ్డుగా ఉందని కన్న కూతురినే కొరికి..

గుంటూరులో మూడేళ్ల చిన్నారి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం రేపింది. ఒంటిపై తీవ్ర గాయాలతో చిన్నారిని జీజీహెచ్‌కు తీసుకురాగా, వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. గాయాలపై అనుమానం వ్యక్తం చేసిన వైద్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదైంది. చిన్నారి మృతికి సంబంధించి తల్లి నాగలక్ష్మీ, ఆమెతో సహజీవనం చేస్తున్న సుభాష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఛీ.. ఛీ.. అమ్మతనానికే మాయని మచ్చ.. సహజీవనానికి అడ్డుగా ఉందని కన్న కూతురినే కొరికి..

మూడేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చిన్నారిని తీసుకొని తల్లిదండ్రులు సుభాష్, నాగలక్ష్మీ గుంటూరు జిజిహెచ్‌కు తీసుకొచ్చారు. వంటిపై తీవ్రగాయాలున్నాయి. పాప ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన వైద్యులు ఆ చిన్నారి చనిపోయినట్లు నిర్దారించారు. ఒంటిపై గాయాలు ఎలా అయ్యాయంటూ వైద్యులు తల్లి నాగలక్ష్మీని ప్రశ్నించారు. ఇంట్లో మెట్ల మీద నుండి పడి గాయాలయినట్లు నాగలక్ష్మీ చెప్పింది. అయితే, ఒంటిపై గాయాలతో పాటు కొరికిన గాట్లున్నాయి. దీంతో వైద్యులకు అనుమానం వచ్చింది. ఆమెను గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. అయితే ఆమె మాత్రం మెట్లపైనే నుండే పడిందని చెప్పింది. దీంతో పోస్టుమార్టమ్ చేస్తామని వైద్యులు చెప్పడంతో వద్దంటూ నాగలక్ష్మీ, సుభాష్ పట్టుబట్టారు. అనుమానం వచ్చిన వైద్యులు అవుట్ పోస్ట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మొదట కొత్తపేట పోలీసులు తర్వాత అరండల్ పేట పోలీసులు వచ్చి కేసు నమోదు చేసి చిన్నారి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

ఏడేళ్ల క్రితం వివాహం.. ఇద్దరు కుమార్తెలు..

నల్ల చెరువుకి చెందిన బచ్చు సాయికి, దేవాపురానికి చెందిన నాగలక్ష్మీతో ఏడేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. సాయికి వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉండటంతో నాగలక్ష్మీ అతనితో ఘర్షణ పడింది. ఈ ఘర్షణ అనంతరం ఇద్దరూ విడిపోయారు. పెద్ద కుమార్తెను తండ్రి తీసుకెళ్లగా చిన్న కుమార్తె ఇషిక తల్లి నాగలక్ష్మీ వద్దే ఉంటుంది.

ఇది ఇలా ఉండగా నాగలక్ష్మీకి సుభాష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పరిచయంతో ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. అయితే ఇషిక అడ్డుగా ఉండటంతో చిన్నారిని కొన్ని రోజులుగా ఇద్దరూ హింసిస్తున్నారు. నిన్న నేలకేసి కొట్టడంతోనే చిన్నారి చనిపోయింది. అయితే, మెట్లపై నుండి పడి తీవ్ర గాయాలయ్యాయని జిజిహెచ్‌కు తీసుకొచ్చారు. వైద్యులు అనుమానం వ్యక్తం చేయడం, ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. ప్రస్తుతం నాగలక్ష్మీ, సుభాష్ లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. త్వరలోనే అరెస్ట్ చూపించే అవకాశం ఉంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← తమలపాకు కాడను పడేస్తున్నారా? వీటితో కలిపి తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా..?Ranabaali: బుక్ మై షోలో ‘రణబాలి’ మూవీకి రికార్డ్ సేల్స్.. ఒక్క గంటలో ఎన్ని టికెట్స్ అమ్ముడవుతున్నాయో తెలుసా? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com