☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

Ranabaali: బుక్ మై షోలో ‘రణబాలి’ మూవీకి రికార్డ్ సేల్స్.. ఒక్క గంటలో ఎన్ని టికెట్స్ అమ్ముడవుతున్నాయో తెలుసా?

టాలీవుడ్ లవ్లీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలు నటించిన లేటెస్ట్ సినిమా రణబాలి. దసరా కానుకగా అక్టోబర్ 16న రిలీజైన ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాను చూసేందుకు బాగా ఆసక్తి చూపిస్తున్నారు.
Ranabaali: బుక్ మై షోలో ‘రణబాలి’ మూవీకి రికార్డ్ సేల్స్.. ఒక్క గంటలో ఎన్ని టికెట్స్ అమ్ముడవుతున్నాయో తెలుసా?

పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన మొదటి సినిమా రణబాలి. దసరా కానుకగా అక్టోబర్ 16న రిలీజైన ఈ సినిమాకు మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వస్తున్నాయి. రజనీకాంత్ నటించిన జైలర్ 2 పోటీలో ఉన్నా రణబాలి సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ విజయ్- రష్మిక ల సినిమాను చూసేందుకు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. 1878 లో రాయలసీమను వెంటాడిన కరువు, ప్రజల కష్టాలు, అదే సమయంలో బ్రిటిష్ పాలకు ఆగడాలను నేపథ్యంగా తీసుకుని దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాను తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన రణబాలి సినిమాలో హాలీవుడ్ స్టార్ నటుడు అర్నాల్డ్ వాస్లూ విలన్ గా నటించడం విశేషం. అలాగే సీనియర్ నటి ఈశ్వరి రావు మరో కీలక పాత్రలో కనిపించారు. అజయ్ అతుల్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

కాగా మొదటి రోజు రణబాలి సినిమాకు సుమారు రూ. 16 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇక వీకెండ్ కావడంతో రెండో రోజైన శనివారం (అక్టోబర్ 17) కూడా విజయ్- రష్మికల సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ లోనూ రణబాలి సినిమాకు రికార్డ్ కలెక్షన్లు వస్తున్నాయి. ఇక బుక్ మై షోలో విజయ్ సినిమా టికెట్లు భారీగా సేల్ అవుతున్నాయి. మొదటి రోజు కంటే రెండో రోజే రణబాలి మూవీ టిక్కెట్లు అమ్ముడుపోవడం విశేషం. ప్రస్తుతం బుక్ మై షో బుకింగ్స్ చూస్తుంటే.. గంటకు సుమారు 11, 160 టికెట్లు బుక్ అవుతున్నాయి. ఇక మొదటి రోజు బుక్ మై షోలో 164. 18k ( 1,64,180) టికెట్స్ సేల్ కాగా రెండో రోజు ఈ సంఖ్య మరింత పెరిగింది. శనివారం 165.94k టికెట్స్ అంటే 1, 65,940 టికెట్లు సేల్ అయ్యాయి. మొత్తానికి ప్రస్తుతం బుక్ మై షో యాప్ లో రణబాలి నంబర్ వన్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది.

బుక్ మై షో టాప్ ట్రెండింగ్ లో రణబాలి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ఛీ.. ఛీ.. అమ్మతనానికే మాయని మచ్చ.. సహజీవనానికి అడ్డుగా ఉందని కన్న కూతురినే కొరికి..Ranabaali : బాక్సాఫీస్‌ను కొల్లగొడుతున్న రణబాలి.. విజయ్-రష్మిక కాంబోకి తిరుగులేదు.. హాట్ కేకుల్లా టిక్కెట్లు.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com