☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Gyanesh Kumar: ‘జ్ఞానేష్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాలి’.. బెంగాల్ బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు

Gyanesh Kumar: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌పై కాంగ్రెస్‌తో సహా ఇతర ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న వేళ, బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు ప్రశంసించారు. బెంగాల్ బీజేపీ చీఫ్ సమీక్ భట్టాచార్య మాట్లాడుతూ.. బెంగాల్‌లో స్వేచ్ఛాయుత, ప్రశాంతమైన ఎన్నికలు నిర్వహించడంలో, ఓటర్ల జాబితాను సవరించడంలో జ్ఞానేష్ కుమార్ కీలక పాత్ర పోషించారని అన్నారు. ఇందుకు ఆయనను పద్మ అవార్డుతో సత్కరించాలని అన్నారు. ఆయనకు ‘పద్మ భూషన్’’ ఇవ్వాలని కోరారు. పశ్చిమ బెంగాల్‌లో గతంలో ఎన్నికల సమయంలో […]
Gyanesh Kumar: ‘జ్ఞానేష్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాలి’.. బెంగాల్ బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు

Gyanesh Kumar: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌పై కాంగ్రెస్‌తో సహా ఇతర ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న వేళ, బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు ప్రశంసించారు. బెంగాల్ బీజేపీ చీఫ్ సమీక్ భట్టాచార్య మాట్లాడుతూ.. బెంగాల్‌లో స్వేచ్ఛాయుత, ప్రశాంతమైన ఎన్నికలు నిర్వహించడంలో, ఓటర్ల జాబితాను సవరించడంలో జ్ఞానేష్ కుమార్ కీలక పాత్ర పోషించారని అన్నారు. ఇందుకు ఆయనను పద్మ అవార్డుతో సత్కరించాలని అన్నారు. ఆయనకు ‘పద్మ భూషన్’’ ఇవ్వాలని కోరారు.

పశ్చిమ బెంగాల్‌లో గతంలో ఎన్నికల సమయంలో భయం, ఒత్తిడి వాతావరణం ఉండేదని, ఇప్పుడు ప్రజలు ఎలాంటి హింస లేకుండా ఓటు హక్కును వినియోగించుకోగలుగుతున్నారని భట్టాచార్య అన్నారు. బెంగాల్ సరిహద్దు రాష్ట్రం కావడంతో ఓటర్ల జాబితాలో అక్రమంగా చేరిన వ్యక్తుల పేర్లు తొలగించడం అవసరమని అన్నారు. ఎన్నికల సంఘం అనర్హుల పేర్లు తొలగించిందని చెప్పారు.

ఇదిలా ఉంటే, ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక రాజకీయ వేడిని పుట్టించింది. ఎస్ఐఆర్ సహా, ఓటర్ల నమోదు ప్రక్రియలో ఎన్నికల కమిషన్లు సుఖ్‌బీర్ సింగ్ సందు, వివేక్ జోషి గత 10 నెలల్లో కనీసం 10 సందర్భాల్లో ఎన్నికల సంఘం నిర్ణయాలు, ఆదేశాలపై అభ్యంతరం తెలిపారని నివేదించింది. ఓటర్ల నమోదు, ఎస్ఐఆర్, పేర్ల తొలగింపు, ఫారం-6 మార్పులు, ఓటర్ల డేటా బేస్ వంటి అంశాలు ఈ నివేదికలో ఉన్నాయి.

అయితే, ఈ నివేదికపై స్పందిస్తూ.. అంతర్గత చర్చల్లో వేర్వేరు అభిప్రాయాలు, సూచలను, లిఖితపూర్వక వ్యాఖ్యలు రావడం సాధారణ ప్రక్రియలో భాగమే అని చెప్పింది. ఎస్ఐఆర్ సహా అన్ని నిర్ణయాలను ముగ్గురు కమిషనర్లు ఏకగ్రీవ ఆమోదంతో తీసుకున్నారని ఈసీ స్పష్టం చేసింది. మరోవైపు, ఈ వివాదంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← మళ్ళీ జెండా మారుస్తున్న వంగవీటి వారసుడు..?Pakistan: ‘‘హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారు?’’.. పాకిస్తాన్ ప్రధాని మౌనం.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com