☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Hanuman Ansh : ‘హనుమాన్ అంశ్’చూడాలన్న తెలుగు ఆడియన్స్ కల తీరుతుందా?

హిందీ మూవీ ‘హనుమాన్ అంశ్’ రిలీజ్ అయిన రెండు వారాల పాటు ఫ్లాప్ మూవీ అన్నారు. మూడో వారం నుంచి ఆ సినిమా గురించి అందరూ మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. మూడు నాలుగు వారాల్లో మంచి వసూళ్లు రాబట్టింది. రెండు కోట్ల బడ్జెట్ తో తీసిన ఆ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు 366 కోట్లు కలెక్ట్ చేసి షాక్ ఇచ్చింది. 400 కోట్ల దిశగా దూసుకుపోతుంది. చిన్న సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో […]
Hanuman Ansh : ‘హనుమాన్ అంశ్’చూడాలన్న తెలుగు ఆడియన్స్ కల తీరుతుందా?

హిందీ మూవీ ‘హనుమాన్ అంశ్’ రిలీజ్ అయిన రెండు వారాల పాటు ఫ్లాప్ మూవీ అన్నారు. మూడో వారం నుంచి ఆ సినిమా గురించి అందరూ మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. మూడు నాలుగు వారాల్లో మంచి వసూళ్లు రాబట్టింది. రెండు కోట్ల బడ్జెట్ తో తీసిన ఆ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు 366 కోట్లు కలెక్ట్ చేసి షాక్ ఇచ్చింది. 400 కోట్ల దిశగా దూసుకుపోతుంది. చిన్న సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పడానికి, డిజాస్టర్ ‘టాక్సిక్’ తో పోలుస్తున్నారు నెటిజన్లు. ‘టాక్సిక్’ ను 450 కోట్ల బడ్జెట్ తో తీస్తే 400 కోట్లకు అమ్మారు. అయితే 342 కోట్ల గ్రాస్, 160 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. ‘హనుమాన్ అంశ్’ను రెండు కోట్లతో తీస్తే ఇప్పటివరకు 366 కోట్ల గ్రాస్, 200 కోట్ల షేర్ రాబట్టింది. సక్సెస్ అంటే ‘హనుమాన్ అంశ్’లా ఉండాలి. ఆగస్టు 7న రిలీజ్ అయి, ఇప్పటికీ మంచి వసూళ్లు రాబడుతుంది. లాంగ్ రన్ అంటే ఇది, లాభాలంటే ఇలా ఉండాలి అంటూ ‘హనుమాన్ అంశ్’ను నెటిజన్లు ఇండైరెక్ట్ గా ‘టాక్సిక్’ మేకర్స్ కు చెప్తున్నారు.

బాలీవుడ్ మూవీ ‘హనుమాన్ అంశ్’లో పేరున్న నటీనటులు లేకపోయినా, కథలోని నిజాయితీ, బలమైన స్క్రీన్ ప్లే ప్రేక్షకులను కట్టి పడేసింది. కథే అసలైన హీరోగా భారీ వసూళ్లతో దూసుకుపోయింది. ఈ సినిమా ఒకటి వస్తుంది అన్న సంగతి ఎవ్వరికీ తెలీదు. థియేటర్స్ కూడా దొరకలేదు. కేవలం పాజిటివ్ మౌత్ టాక్ తో హిట్ అందుకుంది. ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు నీమ్ కరోలి బాబా బయోపిక్ గా ‘హనుమాన్ అంశ్’ రూపొందింది. ఆయన జీవితాన్ని సింపుల్ గా, హృదయాన్ని హత్తుకునేలా చూపించడంతో వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా నేటితరం యువత కనెక్ట్ అయ్యేలా సినిమాను డైరెక్ట్ చేశాడు విశాల్ చతుర్వేది.

‘హనుమాన్ అంశ్’ రిలీజ్ అయిన మొదటి రోజు 10 లక్షలు మాత్రమే వచ్చింది. ఫస్ట్ వీక్ లో కోటి 8 లక్షలు మాత్రమే రాగా, రెండో వారంలో పరిస్థితి చేయి దాటిపోయి 40 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది. సినిమా పనైపోయింది అన్నారు. రెండు వారాల్లో కోటి 48 లక్షలు వసూలు చేయగా, ఇక థియేటర్స్ లో బొమ్మ తీసేయడమే తరువాయి అనుకున్నారు అంతా. మూడో వారంలో ఒక్కసారిగా పికప్ అయి 10.4 కోట్లు రాబట్టింది. నాలుగో వారంలో బాక్సాఫీస్ లెక్కలు మారిపోయాయి. ఆ తర్వాత 100, 200, 300 కోట్ల మార్కును అలా అలవోకగా దాటేసింది. ఇంత సూపర్ హిట్ అయిన ‘హనుమాన్ అంశ్’ను చూడాలన్న తెలుగు ప్రేక్షకుల కల మాత్రం తీరడం లేదు. త్రివిక్రమ్ తెలుగు రైట్స్ కొని 18న రిలీజ్ చేద్దాం అనుకున్నాడు. తెర వెనుక ఏం జరిగిందో ఏమో గానీ, ఉన్నట్టుండి త్రివిక్రమ్ డ్రాప్ కావడంతో తెలుగు వర్షన్ థియేటర్స్ లోకి రావడం లేదు. ‘హనుమాన్ అంశ్’ను చూడాలి అన్న తెలుగు ఆడియన్స్ కల ఎప్పుడు తీరుతుందో చూడాలి మరి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← iBomma Ravi : ఐబొమ్మ రవికి కోర్టులో ఊరట.. రూ.3 కోట్లపై మాత్రం నో.!AP Rain Alert: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com