కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామివారి క్షేత్రం అయిన తిరుమల కొండపై కుండపోత వర్షం పడుతుంది. 12 గంటలుగా ఆగకుండా పడుతున్నది వర్షం. భారీ వర్షంతో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు శ్రీవారి దర్శనం కోసం ఆలయానికి వెళ్తున్న భక్తులు... మరోవైపు స్వామివారి దర్శనం ముగించుకుని ఆలయం వెలుపలకు వస్తున్న భక్తులు వర్షంలో తడిసి ముద్దవుతున్నారు. అయినప్పటికీ గోవింద నామస్మరణతో భక్తులు స్వామివారి దర్శనానికి తరలివెళ్తున్నారు.
తిరుమల క్షేత్రాన్ని భారీ వర్షం ముంచెత్తుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో తిరుమలలోని ఆలయ పరిసరాలు, మాడవీధులు జలమయం అయ్యాయి. శ్రీవారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వర్షం కారణంగా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులతో కలిసి తిరుమలకు వచ్చిన కుటుంబాలు వర్షంలో ఇబ్బందులు పడుతున్నాయి.
ALSO READ : వెంకన్న దర్శనానికి 6 గంటల సమయం..
శ్రీవారి దర్శనం ముగించుకుని ఆలయం వెలుపలకు వచ్చిన భక్తులు వర్షం నుంచి తలదాచుకునేందుకు ఆశ్రయం వెతుక్కుంటున్నారు. మరికొందరు భక్తులు గొడుగులు, రెయిన్‌కోట్లు వేసుకుని ఆలయ పరిసరాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. వర్షం కారణంగా తిరుమలకు వచ్చే భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.


