☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
నరసాపురం మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరేస్తాం! • Gold-Silver Prices Today : పండుగ వేళ బంగారం ధరల్లో కీలక మార్పులు.. తులం రేటు ఎంతంటే? • దసరా తర్వాతే పట్టాలెక్కే ఛాన్స్ • ఘోర ప్రమాదం: కాలువలో పడిన మినీ బస్సు.. 8 మంది మృతి • అబ్బా వీటిని అనవసరంగా లైట్‌ తీసుకున్నామే.. జుట్టురాలడానికి అసలు కారణం ఈ అలవాట్లేనా? • Vaibhav Sooryavanshi: గంభీర్ ఛాన్స్ ఎప్పుడు ఇస్తారు? వైభవ్ సూర్యవంశీ రెండు పదాలతో చెప్పిన సమాధానం ఇదే • Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! • ట్రంప్ కీలక నిర్ణయం.. రష్యాపై చమురు ఆంక్షల్లో మినహాయింపులు? •

Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు

Hydraa | దసరా సెలవులైన ఈ నెల 17 నుంచి 25 వరకు కోర్టు వివాదాల్లో ఉన్న ఆస్తుల విషయంలో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని కలెక్టర్లు, హైడ్రాకు ఉత్తర్వులు జారీచేయాలని హైకోర్టు రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది.
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు

Hydraa | హైదరాబాద్‌, అక్టోబర్‌ 16 (నమస్తే తెలంగాణ) : దసరా సెలవులైన ఈ నెల 17 నుంచి 25 వరకు కోర్టు వివాదాల్లో ఉన్న ఆస్తుల విషయంలో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని కలెక్టర్లు, హైడ్రాకు ఉత్తర్వులు జారీచేయాలని హైకోర్టు రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. అయితే, సంబంధిత వ్యక్తులకు చట్టప్రకారం నోటీసులు జారీ చేయడానికి ఈ ఉత్తర్వులు అడ్డంకి కాదని స్పష్టంచేసింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం చింతగూడెం గ్రామంలో తన పట్టా భూమిలోని పశువుల కొట్టాన్ని కూల్చివేయడంతోపాటు భూమిని స్వాధీనం చేసుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలను సవాలు చేస్తూ ఎస్‌ లీలావతి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌కు పాస్‌బుకులు, ధరణి పోర్టల్‌లోని వివరాలతోపాటు ఆమె భర్త పేరుతో విద్యుత్తు బిల్లులు కూడా ఉన్నాయని తెలిపారు.

ఈ నెల 12న స్థానిక ఎమ్మెల్యే భర్త, గ్రామస్తులతో కలిసి వచ్చిన వీఆర్వో కూల్చివేతలపై బెదిరించారని, పట్టా వివరాలను అధికారులకు చూపించినా పట్టించుకోలేదని పేరొన్నారు. ఇరవై ఏండ్లుగా ఉంటున్న భూమిని స్వాధీనం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ భూమికి సంబంధించి యథాతథస్థితిని కొనసాగించాలని ఆదేశించారు. ఇదే సమయంలో, ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు దసరా సెలవుల సందర్భంగా వివాదాస్పద భూముల్లో కూల్చివేతలు, స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చింది. కోర్టులకు సెలవులు ఉన్న సమయంలో బాధితులకు చట్టప్రకారం పరిషారం పొందే అవకాశం కూడా ఉండదని తెలిపింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. దసరా సెలవుల్లో కోర్టు విచారణలో ఉన్న ఆస్తులపై కఠిన చర్యలు తీసుకోకుండా కలెక్టర్లు, హైడ్రాకు ఉత్తర్వులు జారీచేయాలని రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించారు. ఈ ఉత్తర్వుల ప్రతిని ఆయనకు పంపాలని రిజిస్ట్రీని ఆదేశించారు.

అడ్వకేట్స్‌ అసోసియేషన్‌ కృతజ్ఞతలు

దసరా సెలవుల్లో వివాదాస్పద ఆస్తుల విషయంలో కక్షిదారుల ప్రయోజనాలను పరిరక్షించేలా ఆదేశాలు జారీచేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌కు హైకోర్టు అడ్వకేట్స్‌ అసోసియేషన్‌ కృతజ్ఞతలు తెలిపింది. బార్‌ లేవనెత్తిన ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని, ప్రజల హకుల పరిరక్షణకు తగిన ఆదేశాలు జారీచేయడం అభినందనీయమని అసోసియేషన్‌ కార్యవర్గం పేరొంది. న్యాయాన్ని పొందే హకు, చట్టబద్ధ పాలన పరిరక్షణలో ఈ జోక్యం కీలకమని తెలిపింది. హైకోర్టు ఆదేశాలను సంబంధిత అధికారులు సమర్థంగా అమలు చేస్తారని ఆశిస్తున్నట్టు అసోసియేషన్‌ కార్యదర్శి పీ శ్రవణ్‌కుమార్‌గౌడ్‌ ఓ ప్రకటనలో పేరొన్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com