☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై సమన్లు.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి! • Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్‌ సంచలన వ్యాఖ్యలు! • ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య.. ‘వృషకర్మ’ కొత్త పోస్టర్ విడుదల! • మీ నంబర్ Truecallerలో కనిపిస్తోందా? ఈ ట్రిక్స్‌ ద్వారా డైరెక్టరీ నుండి తొలగించండి..! • Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..! • భారత్‌తో క్రికెట్ ఆడినా మాకు పైసా రావడం లేదు.. వెస్టిండీస్ బోర్డు ఆవేదన • Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ మూవీలో బాలయ్య రిజెక్ట్ చేసిన రోల్ ఎవరు చేశారో తెలుసా? • YS Jagan : ఎంపీ మిథున్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా! చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు.. •

ఏపీ ఎన్నికలు: రాయచోటిలో వైసీపీ ఆఫీసుపై దాడి.. కార్లను తగలబెట్టిన టీడీపీ అనుచరులు

ఏపీ ఎన్నికలు: రాయచోటిలో వైసీపీ ఆఫీసుపై దాడి.. కార్లను తగలబెట్టిన టీడీపీ అనుచరులు
ఏపీ ఎన్నికలు: రాయచోటిలో వైసీపీ ఆఫీసుపై దాడి.. కార్లను తగలబెట్టిన టీడీపీ అనుచరులు
ఏపీ ఎన్నికలు: రాయచోటిలో వైసీపీ ఆఫీసుపై దాడి.. కార్లను తగలబెట్టిన టీడీపీ అనుచరులు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజునే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అన్నమయ్య జిల్లా రాయచోటిలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. ఎస్ఎన్ కాలనీలోని వైసీపీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడటంతో ఒక్కసారిగా హైటెన్షన్ నెలకొంది. ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకోవడంతో ఆ ప్రాంతం యుద్ధ వాతావరణాన్ని తలపించింది.

ఈ హింసాత్మక ఘటనలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం ఎదుట నిలిచి ఉంచిన వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దాదాపు 15 కార్లు దెబ్బతినగా, వాటిలో 4 కార్లకు నిప్పు పెట్టడంతో కాలిబూడిదయ్యాయి. దాడి జరిగిన సమయంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పార్టీ కార్యాలయంలోనే ఉండటంతో పరిస్థితి మరింత హీట్ ఎక్కింది.

రాయలసీమలోని మరో కీలక ప్రాంతమైన పుంగనూరులోనూ ఇదే రీతిలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఎంపీ మిథున్ రెడ్డి తన పార్టీ అభ్యర్థుల నామినేషన్ల కోసం వస్తున్న సమయంలో టీడీపీ, వైసీపీ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. రాళ్లు, కర్రలతో జరిగిన పరస్పర దాడుల్లో కొందరు గాయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. నామినేషన్ల ప్రక్రియలో పారదర్శకత లేదని, ప్రతిపక్షాలను అడ్డుకుంటున్నారని ఇరుపార్టీల నేతలు పరస్పర ఆరోపణలు చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ఎన్నికల వేళ చెలరేగిన ఈ ఘర్షణలు రాజకీయంగా తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. హింసాత్మకమైన పరిస్థితులను పోలీసులు భారీగా మోహరించినప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఎన్నికల సంఘం నిబంధనలను కఠినంగా అమలు చేసి, శాంతిభద్రతలను కాపాడాలని ప్రజలు, విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← Vastu tips: టీ జంక్షన్ రోడ్ పక్కన ప్లాట్ కొనవచ్చా.. అపార్ట్ మెంట్కు వీధిపోటు ఉంటే ఇబ్బందులు ఉంటాయా..!తెలంగాణలో 425 కోట్లతో .. 37 ఆటోమేటెడ్ వెహికల్ టెస్టింగ్ స్టేషన్లు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com