☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

రెండు ప్రపంచ యుద్ధాలను తట్టుకుని నిలబడిన లిమోజెస్ టౌన్ హాల్.. నిరసనల్లో బూడిదైపోయింది!

రెండు ప్రపంచ యుద్ధాలను తట్టుకుని నిలబడిన లిమోజెస్ టౌన్ హాల్.. నిరసనల్లో బూడిదైపోయింది!
రెండు ప్రపంచ యుద్ధాలను తట్టుకుని నిలబడిన లిమోజెస్ టౌన్ హాల్.. నిరసనల్లో బూడిదైపోయింది!
రెండు ప్రపంచ యుద్ధాలను తట్టుకుని నిలబడిన లిమోజెస్ టౌన్ హాల్.. నిరసనల్లో బూడిదైపోయింది!

రెండు ప్రపంచ యుద్ధాలను తట్టుకుని నిలబడిన ఫ్రాన్స్ లోని లిమోజెస్ టౌన్ హాల్.. రాత్రి రాత్రే కాలి కూలి బూడిదైపోవడం ప్రపంచ వ్యాప్తంగా చర్చజరుగుతోంది. చారిత్రాత్మక కట్టడం ధ్వంసమైపోవడంపై ఫ్రాన్స్ ప్రభుత్వం, అధికారులు, పౌరులు ఆందోళన చెందుతున్నారు. మర ఫిరంగుల దాడులను తట్టుకున్న కట్టడం.. నిరసనకారుల దాడికి కూలిపోవడం బాధాకరమైన విషయం

దేశవ్యాప్తంగా సాగుతున్న తీవ్ర నిరసనల మధ్య 2026 అక్టోబర్ 17( శనివారం ) రాత్రి జరిగిన అల్లర్లలో పూర్తిగా అగ్నికి ఆహుతై కుప్పకూలిపోయింది. పెరిగిన నిత్యావసర ధరలు, ఖర్చులకు వ్యతిరేకంగా ఫ్రాన్స్ వీధుల్లోకి వచ్చిన నిరసనకారులు హింసాత్మకంగా మారడంతో అంతా బూడిదైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

143 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ చారిత్రక కట్టడం 1883లో ప్రారంభించారు. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల వంటి భీకర పరిస్థితులను సైతం తట్టుకుని చెక్కుచెదరకుండా నిలిచింది. ప్రస్తుత నిరసనలు, అల్లర్ల కారణంగా బూడిదైంది.

ప్రమాదం జరిగిందిలా:

ముసుగులు ధరించిన కొందరు దుండగులు (Rioters) మొదట టౌన్ హాల్ వెలుపల ఉన్న ఒక పోలీస్ వాహనానికి నిప్పు పెట్టారు. ఆ తర్వాత భవనం కిటికీలను ధ్వంసం చేస్తూ లోపలికి చొరబడి నిప్పు అంటించారు. భవనంలో మంటలు వేగంగా వ్యాపించడంతో 140 అడుగుల (43 మీటర్లు) ఎత్తున్న ఐకానిక్ గడియార స్తంభం (Clock Tower Spire) మంటల్లో కాలిపోతూ రాత్రికి రాత్రే కిందకు కూలిపోయింది.

భారీ నష్టం:

ఈ ప్రమాదంలో భవనం పశ్చిమ భాగం మినహా మిగిలిన పైకప్పు పూర్తిగా కింద అంతస్తులపై కూలిపడిందని అధికారులు తెలిపారు. భవనం వెలుపలి భాగంలో దాదాపు మూడింట రెండు వంతులు పూర్తిగా నాశనమైంది. చారిత్రక సంపదకు జరిగిన అతిపెద్ద విపత్తుగా అభివర్ణించారు.

నిత్యావసరాల ధరల పెరుగుదలపై ఫ్రాన్స్ దేశవ్యాప్తంగా సుమారు 5.5 లక్షల మందికి పైగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారడంతో పారిస్, మార్సెయి, లిల్లే వంటి సిటీల్లో భారీగా లూటీలు, ఆస్తుల ధ్వంసం జరిగాయి. ఉద్రిక్తతలను అదుపు చేయడానికి పోలీసులు లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 1,200 మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← షాద్‌నగర్ రాయికల్ టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్మైసూరులో దసరా సెలబ్రేషన్స్.. రాజసం ఉట్టిపడే ఉత్సవం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com