☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కాక్రోచ్ పార్టీ 2.0 అట్టర్ ఫ్లాప్ : ఎగతాళి చేస్తున్న బీజేపీ • Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందంటే? • విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సుస్మిత కొణిదెల • న్యాయవాదుల నిర్బంధంపై సీజేఐ జోక్యానికి SCBA విజ్ఞప్తి • Penguins: పెరుగుతున్న భూతాపం.. పిట్టల్లా రాలిపోతున్న పెంగ్విన్లు.. • నితిన్ కొత్త సినిమాలో..రుక్మిణీగా బాలీవుడ్ నటి? • తెలుగు అబ్బాయిలంటే ఇష్టం.. పెళ్లి కూడా చేసుకుంటా..! హీరోయిన్ క్రేజీ కామెంట్స్ • కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నాయనమ్మ కన్నుమూత •

రిమ్స్‌‌ ఘటనపై HRC కేసు.. నవజాత శిశువుల మృతిపై సమగ్ర నివేదిక కోరిన కమిషన్‌‌

రిమ్స్‌‌ ఘటనపై HRC కేసు.. నవజాత శిశువుల మృతిపై సమగ్ర నివేదిక కోరిన కమిషన్‌‌
రిమ్స్‌‌ ఘటనపై HRC కేసు.. నవజాత శిశువుల మృతిపై సమగ్ర నివేదిక కోరిన కమిషన్‌‌
రిమ్స్‌‌ ఘటనపై HRC కేసు.. నవజాత శిశువుల మృతిపై సమగ్ర నివేదిక కోరిన కమిషన్‌‌
  • భద్రతా ఏర్పాట్లపై వివరాలు ఇవ్వాలని ఆదేశం

అబిడ్స్‌‌, వెలుగు: ఆదిలాబాద్‌‌ రిమ్స్‌‌లోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగం(ఎస్‌‌ఎన్‌‌సీయూ)లో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు నవజాత శిశువులు మృతిచెందిన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌‌ స్పందించింది. పలు పత్రికల్లో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని కమిషన్‌‌ సుమోటోగా కేసును స్వీకరించింది.

కమిషన్‌‌ చైర్‌‌పర్సన్‌‌ డాక్టర్‌‌ జస్టిస్‌‌ షమీమ్‌‌ అక్తర్‌‌ ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక సమర్పించాలని తెలంగాణ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. సెప్టెంబర్‌‌ 21న అర్ధరాత్రి సమయంలో ఎస్‌‌ఎన్‌‌సీయూలోని ఏసీ యూనిట్‌‌ వద్ద విద్యుత్‌‌ షార్ట్‌‌సర్క్యూట్‌‌ కారణంగా మంటలు చెలరేగి ముగ్గురు శిశువులు మృతి చెందగా, పలువురు శిశువులకు పొగ కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తినట్లు వెల్లడైంది.

ఈ ఘటన నేపథ్యంలో ఎస్‌‌ఎన్‌‌సీయూలోని విద్యుత్‌‌, ఏసీ వ్యవస్థల నిర్వహణ, అగ్నిప్రమాద హెచ్చరిక వ్యవస్థలు, అగ్నిమాపక పరికరాలు, అత్యవసర తరలింపు ఏర్పాట్లు తదితర అంశాలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అగ్నిప్రమాదాలను ఎదుర్కొనేందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయా ?

విద్యుత్‌‌ వ్యవస్థ, ఏసీ పరికరాల నిర్వహణ సక్రమంగా జరిగిందా ? ప్రమాదం జరిగిన వెంటనే శిశువులను రక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే అంశాలపై వాస్తవాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కమిషన్‌‌ పేర్కొంది. ఈ అంశాలపై సమగ్ర నివేదికను అక్టోబర్‌‌ 27లోగా సమర్పించాలని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిని కమిషన్‌‌ ఆదేశించింది.

html, body,
⬇ Full News JPG⬇ Short News JPG
← సింగరేణిలో మైన్స్ రెస్క్యూ పోటీలు షురూ.. కాంపిటీషన్స్లో పాల్గొన్న పది జట్లుAICC అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలిసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com