☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

హైదరాబాద్‌లో విషాదం.. గణేష్ నిమజ్జనం డ్యూటీలో ఉన్న ఎస్సై మృతి..!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం బందోబస్తు విధుల్లో ఉన్న కొత్తగూడెం ఎస్సై వెంకన్న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందారు. ట్యాంక్‌బండ్‌ వద్ద గుర్తుతెలియని బైక్ ఢీకొట్టడంతో గాయపడిన ఆయన చికిత్స పొందుతూ వరంగల్‌లో కన్నుమూశారు. ఈ ఘటనతో పోలీస్‌ శాఖలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్‌లో విషాదం.. గణేష్ నిమజ్జనం డ్యూటీలో ఉన్న ఎస్సై మృతి..!

హైదరాబాద్‌ మహానగరంలో గణేష్ నిమజ్జనం విధులకు హాజరైన ఓ పోలీస్‌ ఎస్సై రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. ట్యాంక్‌బండ్‌ ఎన్టీఆర్‌ మార్గ్‌ వద్ద జరిగిన ఈ ఘటనతో పోలీసు వర్గాల్లో విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కొత్తగూడెం టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న వెంకన్న గణేష్‌ నిమజ్జనం బందోబస్తు విధుల కోసం హైదరాబాద్‌కు వచ్చారు. ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్‌ నంబర్‌ 2 వద్ద ఆయన విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం (సెప్టెంబర్ 23) తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో గుర్తుతెలియని బైక్‌ ఆయనను ఢీకొట్టి పారిపోయింది. ఈ ప్రమాదంలో వెంకన్నకు తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదం అనంతరం సమీప ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించారు. పోలీస్‌ ఉన్నతాధికారుల సూచనల మేరకు వెంకన్నను కొత్తగూడెంలోని ఆయన నివాసానికి తీసుకెళ్లారు. అయితే అక్కడ ఉన్న సమయంలో శరీరంలో నొప్పులు తీవ్రంగా ఉన్నాయని కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో వెంకన్న మృతి చెందారు. గణేష్‌ నిమజ్జనం సందర్భంగా విధులు నిర్వహిస్తూ ప్రమాదానికి గురై ఎస్సై ప్రాణాలు కోల్పోవడం పోలీసు శాఖలో తీవ్ర విషాదాన్ని నింపింది.

వెంకన్నను ఢీకొట్టిన బైక్‌ వివరాలు, ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు, సహచర పోలీసులు ఆయన మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← హోండా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ధర, ఫీచర్లు తెలిస్తే మతిపోతోంది.. ఎక్కడ రిలీజ్‌ చేస్తోందో తెలుసా?RaviChandra : టాలీవుడ్‏లో విషాదం.. సీనియర్ డైరెక్టర్ రవిచంద్ర కన్నుమూత.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com