☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

RaviChandra : టాలీవుడ్‏లో విషాదం.. సీనియర్ డైరెక్టర్ రవిచంద్ర కన్నుమూత..

టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సూపర్ స్టార్ కృష్ణ, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలతో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ రవిచంద్ర కన్నుమూశారు. 84 ఏళ్ల వయసు ఉన్న సారిక సత్య రవిచంద్ర మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
RaviChandra : టాలీవుడ్‏లో విషాదం.. సీనియర్ డైరెక్టర్ రవిచంద్ర కన్నుమూత..

తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన సీనియర్ దర్శకుడు సారిక సత్య రవిచంద్ర (84) హైదరాబాదులో కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. రవిచంద్ర స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు. చిన్నతనం నుంచే సినిమా రంగంపై ఉన్న ఆసక్తితో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. తొలినాళ్లలో దిగ్గజ దర్శకులు కమలాకర కామేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు, అలాగే దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుల వద్ద సహాయ దర్శకుడిగా (అసోసియేట్ డైరెక్టర్) పనిచేసి దర్శకత్వ శాఖపై పూర్తి పట్టు సాధించారు.

రవిచంద్రలోని ప్రతిభను గుర్తించిన నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ, హిందీలో జితేంద్ర కథానాయకుడిగా తెరకెక్కిన ‘ఖైదీ’ చిత్రంతో ఆయనను దర్శకుడిగా పరిచయం చేశారు. ఆ తర్వాత తెలుగులో కృష్ణతో కలిసి ‘రౌడీ నంబర్ వన్’, ‘కిరాయిగూండా’, ‘సార్వభౌముడు’, ‘దొరగారికి దొంగపెళ్లాం’ వంటి సూపర్ హిట్ చిత్రాలను రూపొందించారు. కృష్ణతోనే కాకుండా ఆనాటి అగ్ర హీరోలతో రవిచంద్ర ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించారు. నందమూరి బాలకృష్ణతో ‘దేశోద్ధారకుడు’, ‘అశోక చక్రవర్తి’, విక్టరీ వెంకటేష్ తో ‘అగ్గిరాముడు’, ‘విజేత విక్రమ్’ వంటి చిత్రాలను తెరకెక్కించారు.

కేవలం తెలుగుకే పరిమితం కాకుండా ఇతర భాషల్లోనూ తన ముద్ర వేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ‘మహాగురు’ సహా మొత్తం 6 హిందీ సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. వీటితో పాటు ఒక కన్నడ చిత్రానికి కూడా పనిచేసి బహుభాషా దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. రవిచంద్రకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన సోదరుడు, ప్రముఖ నటుడు సారిక రామచంద్రరావు అందించిన వివరాల ప్రకారం రవిచంద్ర అంత్యక్రియలు హైదరాబాద్‌లోనే జరగనున్నాయి. రవిచంద్ర మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ ఒక అనుభవజ్ఞుడైన సీనియర్ దర్శకుడిని కోల్పోయిందని పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు.

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

⬇ Full News JPG⬇ Short News JPG
← హైదరాబాద్‌లో విషాదం.. గణేష్ నిమజ్జనం డ్యూటీలో ఉన్న ఎస్సై మృతి..!Andhra woman death case: Suspect Ravi Teja hospitalised after alleged suicide bid →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com