☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
వేగంగా దూసుకొస్తున్న కారు.. ఆపి చెక్ చేసిన పోలీసుల మైండ్‌బ్లాక్..! • అబీయేలోని మార్కెట్‌పై డ్రోన్ దాడి: 153 మంది మృతి • పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో సీట్లు • Son of Kanaka Durgamma : అమ్మవారి అవతారంలో లయ.. ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ పోస్టర్ అదిరిందిగా! • Ration Card : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త.. • సౌరవ్ దాస్,అశుతోష్ రాంకాలపై నమోదైన రెండో కేసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ • పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన • ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు! •

RTC Conductors | డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి.. కండక్టర్లు విధుల్లోకి రాకుండా అడ్డుకున్న కుషాయిగూడ ఆర్టీసీ అధికారులు!

RTC Conductors | హైదరాబాద్‌ కుషాయిగూడ ఆర్టీసీ డిపో వద్ద బుధవారం స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీసీ డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి అంటూ మహిళా కండక్టర్లను ఆర్టీసీ అధికారులు అడ్డుకున్నారు.
RTC Conductors | డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి.. కండక్టర్లు విధుల్లోకి రాకుండా అడ్డుకున్న కుషాయిగూడ ఆర్టీసీ అధికారులు!

RTC Conductors | హైదరాబాద్‌ పరిధిలోని కుషాయిగూడ ఆర్టీసీ డిపో వద్ద బుధవారం స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. డిపో వద్దకు వచ్చిన మహిళా కండక్టర్లను ఆర్టీసీ అధికారులు విధుల్లోకి అనుమతించలేదు. ఆర్టీసీ డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి అంటూ వారిని అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేయనివ్వకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనపై మహిళా కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులకు కేటాయించిన డ్రైవర్లు విధులకు రాకపోతే తాము సెలవు పెట్టి వెళ్లాలని అధికారులు చెబుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు విధుల్లోకి అనుమతించాలని డిపో ఎదుటే ఎదురుచూస్తున్నారు.

ఉదయం నుంచే డిపోకు చేరుకున్నప్పటికీ అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకాలు చేయనివ్వకుండా అధికారులు అడ్డుకుంటున్నారని మహిళా కండక్టర్లు తెలిపారు. డ్రైవర్లు విధులకు హాజరుకాని సందర్భాల్లో తమను సెలవు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. తాము విధులకు సిద్ధంగా ఉన్నప్పటికీ అనవసరంగా సెలవు తీసుకుంటే జీతంపై ప్రభావం పడుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు.

డ్రైవర్లు రాకపోతే అందుకు కండక్టర్లు ఎందుకు సెలవు పెట్టాలని వారు ప్రశ్నించారు. ఉదయం నుంచి డిపోలోనే వేచి ఉన్నా తమకు విధుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వడం లేదని వాపోయారు. విధులకు హాజరైన ఉద్యోగులను అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకాలు చేయనివ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

అయితే, డిపో అధికారుల వివరణ మరోలా ఉంది. డ్రైవర్‌ విధులకు గైర్హాజరైనంత మాత్రాన అదే బస్సుకు కేటాయించిన కండక్టర్‌కు సెలవు వేస్తారనడం అవాస్తవమని వారు స్పష్టం చేశారు. కండక్టర్లకు పూర్తి జీతాలు అందుతాయని, సెలవుగా నమోదు చేయడం వల్ల జీతంలో కోత ఉండదని తెలిపారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Mahasakthi | నయనతార ‘మహశక్తి’ ట్రైలర్ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్!Son of Kanaka Durgamma : అమ్మవారి అవతారంలో లయ.. ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ పోస్టర్ అదిరిందిగా! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com