☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?

Hyderabad Metro: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి భారీగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో నగర మెట్రో రైలు సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల సౌకర్యార్థం సెప్టెంబర్ 25న హైదరాబాద్ మెట్రో రైలు సేవలను సెప్టెంబర్ 26వ తేదీ తెల్లవారుజామున 1 గంట వరకు పొడిగించింది. దీంతో నిమజ్జన వేడుకలకు వెళ్లే భక్తులు రాత్రివేళ కూడా మెట్రో సేవలను వినియోగించుకోవచ్చు. సెప్టెంబర్ 25న అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి మెట్రో రైలు తెల్లవారుజామున 1:00 గంటలకు బయలుదేరుతుందని […]
Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?

Hyderabad Metro: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి భారీగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో నగర మెట్రో రైలు సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల సౌకర్యార్థం సెప్టెంబర్ 25న హైదరాబాద్ మెట్రో రైలు సేవలను సెప్టెంబర్ 26వ తేదీ తెల్లవారుజామున 1 గంట వరకు పొడిగించింది. దీంతో నిమజ్జన వేడుకలకు వెళ్లే భక్తులు రాత్రివేళ కూడా మెట్రో సేవలను వినియోగించుకోవచ్చు.

సెప్టెంబర్ 25న అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి మెట్రో రైలు తెల్లవారుజామున 1:00 గంటలకు బయలుదేరుతుందని మెట్రో అధికారులు వెల్లడించారు. నిమజ్జనం సందర్భంగా నగరంలోని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు, భారీ రద్దీ ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు ప్రజా రవాణాను వినియోగించుకోవాలని సూచించారు.

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో వినాయక విగ్రహాలు శోభాయాత్రగా హుస్సేన్ సాగర్ వైపు తరలివస్తాయి. ఖైరతాబాద్ మహాగణపతితో పాటు వేలాది విగ్రహాల నిమజ్జనాన్ని వీక్షించేందుకు నగరవాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు నగరానికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ, వాహనాల రాకపోకలపై ఆంక్షలు, పార్కింగ్ సమస్యలు తలెత్తే అవకాశం లేకుండా.. సొంత వాహనాల్లో వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా మెట్రో సేవలను వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← మత స్వేచ్ఛ పరిరక్షణపై రాష్ట్రపతితో భేటీకి జమియత్ విజ్ఞప్తిKakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్‌ ఆకస్మిక మృతి.. వైఎస్‌ జగన్ దిగ్భ్రాంతి →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com