☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్‌ ఆకస్మిక మృతి.. వైఎస్‌ జగన్ దిగ్భ్రాంతి

Kakumanu Rajasekhar Death: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది.. వైఎస్సార్‌సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ లిడ్‌క్యాప్‌ ఛైర్మన్‌ కాకుమాను రాజశేఖర్‌ ఆకస్మిక మరణంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజశేఖర్‌ మృతి పార్టీకి, వ్యక్తిగతంగా తనకు తీరని లోటని జగన్‌ పేర్కొన్నారు. కాగా, కాకుమాను రాజశేఖర్‌ గురువారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన […]
Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్‌ ఆకస్మిక మృతి.. వైఎస్‌ జగన్ దిగ్భ్రాంతి

Kakumanu Rajasekhar Death: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది.. వైఎస్సార్‌సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ లిడ్‌క్యాప్‌ ఛైర్మన్‌ కాకుమాను రాజశేఖర్‌ ఆకస్మిక మరణంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజశేఖర్‌ మృతి పార్టీకి, వ్యక్తిగతంగా తనకు తీరని లోటని జగన్‌ పేర్కొన్నారు. కాగా, కాకుమాను రాజశేఖర్‌ గురువారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన వైఎస్సార్‌సీపీకి అంకితభావంతో పనిచేశారని, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించారని జగన్‌ గుర్తుచేశారు.

రాజశేఖర్‌ ఆకస్మిక మరణం తీవ్రంగా బాధించిందని జగన్‌ తెలిపారు. పార్టీ కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొంటూ, ఆయన లేని లోటు పార్టీకి ఎప్పటికీ పూడ్చలేనిదని అన్నారు. రాజశేఖర్‌ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు వైఎస్‌ జగన్‌.. కాగా, గతంలో లిడ్‌క్యాప్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన రాజశేఖర్‌, ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన మృతి నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. రాజశేఖర్‌ మృతికి పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

ఇక, తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ కు నివాళులు అర్పించారు పార్టీ నేతలు.. కాకుమాను రాజశేఖర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు జూపూడి ప్రభాకర్, టీజేఆర్ సుధాకర్ బాబు, పుత్తా శివ శంకర్, మనోహర్ రెడ్డి, నారాయణమూర్తి, కొమ్మూరి కనకారావు, సురేంద్ర, ఇతర నేతలు..

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?దంచికొట్టే వానల్లో డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ విషయాల్లో జాగ్రత్త →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com