☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

దంచికొట్టే వానల్లో డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ విషయాల్లో జాగ్రత్త

వాయు గుండం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల వలన ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక ఎంత వర్షం పడినా సరే కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోకతప్పదు. దీంతో ఈ సమయంలో కూడా చాలా మంది బైక్, కార్ ఇలా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. అయితే వర్షాల సమయంలో రోడ్లు జారుడు, తడిగా, మేఘావృతం అవ్వడం వలన చీకటిగా అనిపించడం జరుగుతుంది. దీని వలన పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంది.
దంచికొట్టే వానల్లో డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ విషయాల్లో జాగ్రత్త
Rain Driving 2

అయితే ఈ వర్షాకాలంలో ఎలాంటి ప్రమాదాలు లేకుండా డ్రైవింగ్ సాఫీగా చేయాలి అంటే తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి అని చెబుతున్నారు నిపుణులు. కాగా, ఇప్పుడు మనం వర్షాలు పడుతున్న సమయంలో డ్రైవింగ్ చేసే వారు ఎలాంటి నియమాలు పాటించాలో వివరంగా తెలుసుకుందాం పదండి.

Rain Driving

వాహనం, వాహనానికి మధ్య తగిన దూరం పాటిస్తూ డ్రైవింగ్ చేయాలి. వర్షాకాలం సమయంలో కొన్ని సార్లు సడన్ బ్రేక్ వేయాల్సి వస్తుంది. అయితే అటువంటి సమయంలో ఈ వాహనం మధ్య గ్యాప్ మిమ్మల్ని ప్రమాదం నుంచి కాపాడుతుంది. అందువలన వాహనం వాహనానికి మధ్య తప్పనిసరిగా తగిన దూరాన్ని పాటించాలి.

Rain Driving 1

వర్షాలు పడుతున్న సమయంలో వీలైనంత వరకు వేగంగా వాహనాలు నడపకూడదు. అధిక వేగంతో డ్రైవింగ్ చేయడం వలన రోడ్లు తడిగా ఉండి జారుతుంటాయి. అంతే కాకుండా దీని వలన వాహనాలు స్లిప్ అవ్వడం, అదుపు తప్పిపడిపోవడం జరుగుతుంది. అందువలన వీలైనంత వరకు అధిక వేగాన్ని నియంత్రించి వాహనం నడపడం చాలా ముఖ్యం.

Rain Driving 3

అదే విధంగా వాహన లైట్లు, వైపర్లను సరిగ్గా వాడుకోవాలి. వర్షంలో ఎదురుగా వచ్చే వాహనాలకు మీ వాహనం కనిపించాలంటే హెడ్ లైట్లు ఆన్ లో ఉంచాలి. పొగమంచు ఉంటే ఫాగ్ లైట్లు వాడాలి. చాలా మంది హెజార్డ్ లైట్లు వేసి నడుపుతుంటారు, అది తప్పు. వైపర్ బ్లేడ్లు అరిగిపోతే వెంటనే మార్చాలి. అద్దాలపై పొగమంచు పట్టకుండా డీఫాగర్ ఆన్ చేసుకోవాలి. లేకపోతే మీరు ప్రమాదంలో చిక్కుకునే ఛాన్స్ ఉంటుంది.

Rain Driving 4

నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న చోట వాహనాన్ని నడపకూడదు. రోడ్డుపై నీరు నిలిచిన చోట ఎంత లోతు ఉందో తెలియదు. కాబట్టి నీరు ఎక్కువగా ఉన్న దారిలోకి వెళ్లకపోవడమే మంచిది. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే ఫస్ట్ గేర్ లో నెమ్మదిగా వెళ్లాలి. నీటిలో వాహనం ఆగిపోతే మళ్లీ మళ్లీ స్టార్ట్ చేయవద్దు, ఇంజిన్ లోకి నీరు వెళ్లి పాడయ్యే ప్రమాదం ఉంది. అందువలన మీరు నీరు ఎక్కువగా ఉన్న చోటు నుంచి వెళ్లాలి అనుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.

⬇ Full News JPG⬇ Short News JPG
← Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్‌ ఆకస్మిక మృతి.. వైఎస్‌ జగన్ దిగ్భ్రాంతిTollywood : స్టార్ హీరోలకు ధీటుగా విలనిజం.. అంత పర్సనాలిటీ ఉన్న రామిరెడ్డి ఎలా చనిపోయారంటే.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com