☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Harish Rao | రాజ్యాంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే మిగతా ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి : మాజీ మంత్రి హరీష్‌రావు

Harish Rao | కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ కి రాజ్యాంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని మాజీ మంత్రి హరీష్‌రావు డిమాండ్‌ చేశారు.
Harish Rao | రాజ్యాంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే మిగతా ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి : మాజీ మంత్రి హరీష్‌రావు

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ( Rahul Gandhi ) కి రాజ్యాంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని మాజీ మంత్రి హరీష్‌రావు( Harish Rao) డిమాండ్‌ చేశారు. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ( Danam Nagendhar ) సభ్యత్వాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు ( Supreme Court ) సమర్ధించడం పట్ల ఆయన స్పందించారు.

సుప్రీం తీర్పు రేవంత్‌కు, కాంగ్రెస్‌కు చెంపపెట్టులాంటిదని అన్నారు. రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతున్న రాహుల్‌ గాంధీకి ఈ తీర్పుతో కనువిప్పు కలగాలని పేర్కొన్నారు. మాటల్లో నిజాయితీ ఉంటే , రాజ్యాంగాన్ని కాపాడాలని చిత్తశుద్ధి ఉంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్‌ చేశారు.

మిగతా శాసనసభ్యులకు ఇదే విధంగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పుతో కాంగ్రెస్‌ తప్పు చేసిందని, స్పీకర్‌ వారిని కాపాడే ప్రయత్నం చేశారని, రేవంత్‌ రెడ్డి అరాచకాలు బట్టబయలయ్యాయని వెల్లడించారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Jagadish Reddy | రేవంత్‌ మంచి బొగ్గును ఏపీలో తన గురువు చంద్రబాబుకి పంపిస్తున్నడు : మాజీ మంత్రి జగదీష్ రెడ్డిMuthoot Fincorp | బీసీసీఐతో దోస్తీ.. టీమిండియా టైటిల్ స్పాన్సర్‌గా ‘ముత్తూట్ ఫిన్‌కార్ప్’..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com