☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Muthoot Fincorp | బీసీసీఐతో దోస్తీ.. టీమిండియా టైటిల్ స్పాన్సర్‌గా ‘ముత్తూట్ ఫిన్‌కార్ప్’..!

Muthoot Fincorp : ప్రముఖ ఫైనాన్స్ కంపెనీ ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ (Muthoot Fincorp LTD) పంట పండనుంది. బంగారంపై రుణాలతో అందరికీ చేరువైన ఈ సంస్థ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)తో దోస్తీకి సిద్ధమైంది.
Muthoot Fincorp | బీసీసీఐతో దోస్తీ.. టీమిండియా టైటిల్ స్పాన్సర్‌గా ‘ముత్తూట్ ఫిన్‌కార్ప్’..!

Muthoot Fincorp : ప్రముఖ ఫైనాన్స్ కంపెనీ ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ (Muthoot Fincorp LTD) పంట పండనుంది. బంగారంపై రుణాలతో అందరికీ చేరువైన ఈ సంస్థ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)తో దోస్తీకి సిద్ధమైంది. పలు సంస్థలను వెనక్కి నెట్టి భారత జట్టు టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులు దక్కించుకుందీ సంస్థ. వచ్చే రెండేళ్ల పాటు టీమిండియా జెర్సీలపై ముత్తూట్ పేరు తళుక్కుమననుంది. ‘బ్లూ ముత్తూట్’ (Blue Muthoot) పేరుతో టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుందీ కంపెనీ. అయితే.. స్వదేశంలో టీమిండియా ఆడే మ్యాచ్‌లకు మాత్రమే పరిమితం కానుందని సమాచారం.

క్రిక్‌బజ్ కథనం ప్రకారం.. ప్రస్తుతం ద్వైపాక్షిక సిరీస్‌లో భారత జట్టు టైటిల్ స్పాన్సర్‌గా కంపా, ఎస్‌బీఐ లైఫ్‌, చాట్‌జీపీటీలు ఉన్నాయి. ఇప్పుడు వీటి సరసన ముత్తూట్ ఫిన్‌కార్ప్ కూడా చేరనుంది. రెండేళ్ల కాలానికి బీసీసీఐతో ముత్తూట్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అంటే.. 2028 మార్చి 31 వరకూ ఈ హోదాలో కొనసాగనుందీ కొచ్చికి చెందిన ఫైనాన్స్ కంపెనీ. అయితే.. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

ఒక్క మ్యాచ్‌ @ 4.85 కోట్లు

సొంతగడ్డపై త్వరలో వెస్టిండీస్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌తో టీమిండియా టైటిల్ స్పాన్సర్‌గా ముత్తూట్ ప్రయాణం మొదలవ్వనుంది. అక్టోబర్ 16 నుంచి విండీస్‌తో వన్డే సిరీస్ నుంచి బ్లూ ముత్తూట్ పేరుతో ఈ కంపెనీ పేరు మరింత మందికి చేరువకానుంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన బీసీసీఐ టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులకు ముత్తూట్ ఫైనాన్స్ భారీగానే ఖర్చు చేయనుందని టాక్.

టీమిండియా ఒక్కో మ్యాచ్‌కు కనీస ధర రూ.4.85 కోట్లు కాగా.. బేరసారాల అనంతరం ఈ మొత్తం కాసింత తగ్గే అవకాశముంది. టైటిల్‌ స్పాన్సర్‌గా ముత్తూట్ పేరును బీసీసీఐ త్వరలోనే వెల్లడించనుంది. ఈ రెండేళ్లలో.. టీమిండియా స్వదేశంలో 35 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుంది. వీటిలో 10 టెస్టులు, 12 వన్డేలు, 13 టీ20లు ఉన్నాయి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Harish Rao | రాజ్యాంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే మిగతా ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి : మాజీ మంత్రి హరీష్‌రావుMaganoor | ఇంటర్ ప్రవేశాలకు చివరి అవకాశం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com